పెళ్లి చేసుకునేవారికి శుభవార్త.. లక్ష నుండి కోటి రూపాయల వరకు లోన్స్!

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ప్రస్తుతం పెళ్లిళ్లు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ప్రీ వెడ్డింగ్ నుండి మొదలు పెడితే రిసెప్షన్ వరకు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పెళ్లి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి జీవితంలో ఒకటే సారి జరిగేది. కాబట్టి దానిని అందమైన జ్ఞాపకంగా మార్చుకోవడానికి ఎంతైనా ఖర్చు చేస్తున్నారు.

పెళ్ళిళ్ళ కోసం లోన్స్
డబ్బు లేని వారు కూడా పెళ్లి ఘనంగా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు అప్పులు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అయితే సహజంగా మన బ్యాంకులలో కానీ, ప్రైవేటు ఫైనాన్స్ వ్యవస్థలో కానీ పెళ్లి చేయడం కోసం లోన్స్ ఇచ్చే సౌకర్యం లేదు. తాజాగా అటువంటి సౌకర్యాన్ని తీసుకువచ్చింది మ్యాట్రిమోనీ. కామ్.

Good news for those getting married Loans from one lakh to one crore rupees

పెళ్లి ఖర్చుల కోసం రుణాలిచ్చే ప్లాన్
ఇప్పటివరకు పెళ్లి సంబంధాలను మాత్రమే కుదర్చడానికి పనిచేస్తున్న ఈ సంస్థ ఇకపై పెళ్లి చేసుకునే వారికి వారి ఖర్చులకోసం రుణాలను కూడా ఇప్పించటానికి రెడీ అయింది. దీనికోసం వెడ్డింగ్ లోన్స్. కామ్ అనే ఫిన్ టెక్ వేదికను ప్రారంభించింది. టాటా క్యాపిటల్ ఎల్ అండ్ టి ఫైనాన్స్ ఐడిఎఫ్సి వాటి ఫైనాన్స్ సంస్థలతో వెడ్డింగ్ లోన్స్. కామ్ ఒప్పందం చేసుకుంది. పెళ్లిళ్లు చేసుకునే వారికి లోన్లు ఇప్పించడానికి రెడీ అయింది.

లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లోన్స్
ఒక లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లోన్లను సదరు వెడ్డింగ్ లోన్స్ . కామ్ అందించనున్నట్టు పేర్కొంది. దీనికోసం నెలవారి ఈఎంఐ ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ నియమ నిబంధనల ప్రకారమే లోన్లను ఇవ్వనంది. పెళ్లి కోసం తీసుకున్న ఈ లోన్లను 30సంవత్సరాల వరకు ఈఎంఐ విధానంలో చెల్లించడానికి కూడా అవకాశం కల్పిస్తోంది. ఈసారి ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు పేర్కొంది.

పెళ్ళికి లోన్ విషయంలో జాగ్రత్త
పెళ్లి ఘనంగా చేయాలని డబ్బులు లేక ఇబ్బంది పడే వారికి ఇది సువర్ణవకాశం కాదా అప్పులు చేసి పెళ్లిళ్లు చేసి ఆ తర్వాత అష్ట కష్టాలు పడాల్సిన అవసరం లేదని ఉన్నంతలో సాధ్యమైనంత మంచిగా పెళ్లి చేయవచ్చని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్లాట్లు ఇల్లు కొనుక్కుంటామంటే లోన్లు ఇచ్చే వ్యవస్థ నుంచి, పెళ్లి చేసుకుంటామంటే కూడా లోన్ సౌకర్యం కల్పించే వ్యవస్థ వరకు మన ఫైనాన్స్ సిస్టమ్ అప్గ్రేడ్ కావడం ఒక మంచి విషయమే. కానీ లోన్స్ తీసుకునేవాళ్ళు అన్ని వివరాలు కూలంకషంగా తెలుసుకున్నాకే తీసుకోవటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+