హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణపై అదిరిపోయే శుభవార్త!
భారతదేశంలోనే మూడవ అతి పెద్ద మెట్రో నెట్వర్క్ గా హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ ఉందని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి పేర్కొన్నారు.
ఏడేళ్ళు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో రైళ్ళు
మెట్రో రైలు 7 సంవత్సరాల పూర్తి చేసుకుందని ఇది నగర వాసులకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండి ప్రపంచంలోనే ఏడేళ్ళు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్ గా అరుదైన ప్రతిష్టను సంపాదించుకుందని మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి చెప్పారు.

దేశంలో హైదారాబాద్ కు మూడవ స్థానం
మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం జరిగే సమయంలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని పేర్కొన్న ఆయన ఈరోజు మెట్రో రైల్ అందిస్తున్న సేవలతో అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారన్నారు. ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేని కారణంగానే మూడవ స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డితో మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణ పై చర్చ జరిపాం
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణపై సుదీర్ఘంగా చర్చ జరిపామని ఆయన పేర్కొన్నారు. దేశంలో మూడో అతిపెద్ద మెట్రో నెట్ వర్కగా ఉందన్నారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తోందని చెప్పారు. మొత్తం 57 స్టేషన్లతో ప్రపంచంలొనే PPP మోడ్లో అతిపెద్ద నెట్ వర్క్ తో 22 వేల కోట్ల రూపాయిలతో అందుబాటులో ఉందన్నారు.
రెండో దశలో 116.4 కిలోమీటర్ల విస్తరణ ప్రయత్నం
హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లూ విమానాశ్రయానికి కలిసేలా రెండో దశ ప్రాజెక్టులో ఐదు కారిడార్లకు డీపీఆర్ లు సిద్ధం చేసి పంపామని ఆయన అన్నారు. మొత్తం రెండో దశలో 116.4 కిలోమీటర్ల పైగా మార్గాన్ని చేపట్టనున్నట్లు NVS రెడ్డి చెప్పారు.కేంద్ర ప్రభుత్వ నియమం ప్రకారం 90 శాతం రైట్ ఆఫ్ వే ఉండాలన్న నియమం మేరకు అమలయ్యేలా ప్రాజెక్టు అనుమతులకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications