తెలంగాణాకు కేంద్రం భారీ శుభవార్త.. వారి ఖాతాల్లో ఆ నిధులు!
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు కేంద్రం ఒకేసారి భారీగా నిధులను విడుదల చేసింది. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద తొలి విడతగా 259.36 కోట్లను జనవరి 5వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఆ నిధుల విడుదలతో రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ధి పనులు
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత, కొత్తగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. గతంలో పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో నిధుల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది కేంద్రం. ఇప్పుడు సాంకేతిక అడ్డంకులు కూడా తొలగిపోవడంతో నిధులు విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ధి పనులు జరగనున్నాయి.

జనవరి 5న విడుదలైన నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి
కేంద్రం ఇచ్చిన నిధులతో గ్రామాల అభివృద్ధికి, పాలనపరమైన ప్రక్రియ వేగవంతం చేయడానికి సర్పంచులు పనిచేయనున్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలకు కేంద్రం నుండి 3 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు రావలసి ఉంది. వీటిని కేంద్రం దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం జనవరి 5వ తేదీన విడుదలైన ఈ నిధులతో మళ్ళీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోబోతున్నాయి.
నిధుల విడుదలకు కేంద్ర మంత్రుల చొరవ
అయితే వీటితో గ్రామాలలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించ బడతాయి. వీధి దీపాలను ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, పారిశుధ్య పనులను చేయడం వంటి పనుల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తారు. అయితే ఈ నిధులను విడుదల చేయడానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపించారని నిధులు వచ్చేలా చేశారని బిజెపి చెబుతోంది.
నిధుల విడుదలకు మంత్రి సీతక్క కృషి
కానీ నిధుల మంజూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారని కాంగ్రెస్ వెల్లడిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ అధికారులతో ఆమె అనేకమార్లు సంప్రదింపులు జరిపినట్టు కాంగ్రెస్ వెల్లడిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం గ్రామాలలో గ్రామ పంచాయతీల ఖాతాలకు కొంత 15వ ఆర్థిక సంఘం నిధులు చేరడంతో గ్రామాల అభివృద్ధి పనుల పురోగతి కనిపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications