రానున్న ఆరు సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు !
హైదరాబాద్ : నిరుద్యోగ యువత గుడ్ న్యూస్. దేశంలో అమలవుతోన్న సంస్కరణలు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. 2025 నాటికి 8 రంగాల్లో 10 కోట్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోందని అంచనా వేసింది. రిటైల్, నిర్మాణం, రవాణా మరియు లాజిస్టిక్స్, పర్యాటక రంగం, హండ్లూమ్స్, టెక్స్ టైల్స్ మరియు దుస్తులు, ఆహారశుద్ధి, ఆటోమోటివ్ రంగాల్లో విరివిగా ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టంచేసింది.
పెరిగిన నైపుణ్యం .. ఉద్యోగాల కల్పన
ఉద్యోగాల వృద్ధికి మరో కారణం నైపుణ్య వృద్ధి పెరగడమేనని పేర్కొంది. దీంతోపాటు ఇబ్బడి ముబ్బడిగా కొత్త వ్యాపారాలు రావడం, స్టార్టప్ గణనీయమైన వృద్ధి సాధించడం కలిసి వస్తోందని అంచనా వేసింది. వీటన్నింటి ఫలితంగా ఉద్యోగాల్లో నాణ్యత పెరిగి .. మంచి వేతనాలు కూడా అందజేస్తున్నారని సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భర్తి మిట్టల్ మీడియాకు తెలిపారు.

పెరుగనున్న ఉద్యోగులు
ఉద్యోగుల భవిష్య నిధి వద్ద ఉన్న సమాచారం మేరకు సెప్టెంబర్ 2017 నుంచి డిసెంబర్ 2018 మధ్య 72 లక్షల మంది కొత్తగా సామాజిక భద్రత పథకాల్లో పేరు నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ సంఖ్య 2025 నాటికి పెరుగుతోందని అంచనా వేశారు. కేవలం నిర్మాణ రంగంలోనే 2.87 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తర్వాత రిటైల్, రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా అవసరమవుతాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications