సభలో గందరగోళం సృష్టిస్తే ఊరుకోం: కాంగ్రెస్‌కు హరీష్‌ హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శాసనసభలో ఏ అంశమైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సభ కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.

  Renuka Chowdhury arrest @ Telangana Assembly : Chalo Assembly Protest | Oneindia Telugu

  అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత టిడిఎల్పీ కార్యాలయంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని హరీష్‌రావు ప్రకటించారు. అయితే సభలో చర్చించకుండా గొడవ చేయడం సరైందికాదని హరీష్‌రావు అభిప్రాయపడ్డారు.

  Governament ready to discuss any issue in Assembly says minister Harishrao

  శాసనభసభ ప్రారంభమైన తొలిరోజునే సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళానికి పాల్పడడాన్ని హరీష్‌రావు తప్పుబట్టారు. తొలి రోజు కాబట్టి ఉపేక్షించామన్నారు. రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలానే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హరీష్‌రావు హెచ్చరించారు.

  ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తోందో చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని హరీష్‌రావు చెప్పారు.సభలో మాట్లాడడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana minister harishrao said that governatment ready to discuss any issue in Assembly. He spoke to media on Friday at TRSLP.Harishrao made allegations on Congress party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి