70ఏళ్ళ బామ్మ పెళ్లి.. ఘనంగా జరిగింది మళ్ళీ.. వైరల్ వీడియో!!

పెళ్ళంటే వేద మంత్రాలు, మేళ తాళాలతో, బంధుగణం అంతా ఒకచోట చేరి మాంగళ్య ధారణ, తలంబ్రాలతో జరిగే వేడుక. అలాంటి వేడుక చేసుకోలేకపోయిన వారికి చాలాసార్లు అది ఒక వెలితిగా కనిపిస్తుంది.ఆ లోటు ఏం చేసినా తీరదు. ముసలి వారైనా సరే ఆ బాధ మనసును వేధిస్తుంది. అలాంటి ఒక బామ్మ వేదన తగ్గించే ప్రయత్నం చేశారు ఆమె మనవళ్ళు.

బామ్మ పెళ్లి ఘనంగా చేసిన మనవళ్ళు
మహబూబాబాద్ జిల్లాలో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 70 సంవత్సరాల బామ్మకు మనవళ్ళు మళ్లీ పెళ్లి చేసిన ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బామ్మకు మళ్లీ పెళ్లి చేసి ఆమె చిరకాల వాంఛ తీర్చిన ఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 70 ఏళ్ల బామ్మకు మళ్ళీ పెళ్ళేంటి ? అని ఆశ్చర్యపోయేవారు అసలు ఆమె కథ ఏమిటో తెలుసుకోవాల్సిందే.

Grands children fullfilled their 70years old grandmother desire by doing again marriage to her

అప్పట్లో గాంధర్వ వివాహం చేసుకున్న జంట
మహబూబాబాద్ కు చెందిన గుగులోతు లాలీ(70) సామీడ నాయక్ (80) 60 ఏళ్ళ ముందు గాంధర్వ వివాహం చేసుకున్నారు . కేవలం వారు దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు కొడుకులు, ఒక్క కూతురు ఉన్నారు. అయితే గోగులోత్ లాలీ అందరు ఆడవాళ్లకు ఉన్నట్టు తనకు మంగళసూత్రం లేదని తరచు బాధపడేది. ఆమె పిల్లలే కాదు మనవళ్ళు, మనవరాళ్ళు వచ్చినా ఆమె మంగళసూత్రం లేదని బాధపడుతూ ఉండేది.

బామ్మకు మళ్ళీ పెళ్లి చేసిన మనవళ్ళు
దీంతో బామ్మను సంతోషంగా ఉంచాలని భావించిన మనవళ్ళు, మనవరాళ్ళు సహస్ర చంద్ర దర్శన వేడుక సందర్బంగా, నానమ్మ తాతయ్యలయిన గోగులోత్ లాలీ, సామీడ నాయక్ లకు మళ్ళీ పెళ్లి చేశారు. అలాంటి ఇలాంటి పెళ్లి కాదు మేళ తాళాలతో, వేద మంత్రాలతో చాలా శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. సాంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్ళిలో తాత, బామ్మ మెడలో మూడు ముళ్ళేసి మాంగళ్య ధారణ చేశారు

బామ్మను పెళ్ళాడిన తాత
కూర్చుంటే లేవలేని వయసులో ఇద్దరూ తలంబ్రాలు పోసుకున్నారు. మెట్టెలు పెట్టటం, ఒడి బియ్యం పోయటం ఇలా అన్నీ శాస్త్రోక్తంగా జరిగాయి. దీంతో బామ్మ చిరకాల వాంఛ తీరినట్టు అయ్యింది. నానమ్మ కోసం మనవళ్లు చేసిన పని, ఘనంగా జరిగిన పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బామ్మ కోరిక తీర్చిన మనవళ్ళను అందరూ శెభాష్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+