మేడారం జాతరలో హలాల్ నిషేధం: సమ్మక్క ప్రధాన పూజారి కీలకవ్యాఖ్యలు!!
ఆసియా ఖండంలోనే అత్యంత విశేషంగా జరిగే గిరిజన జాతర మేడారం జాతర . విగ్రహాలు లేనటువంటి విశిష్టమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. త్వరలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు నిధులను మంజూరు చేయగా, కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అన్ని రకాల చర్యలను చేపడుతుంది. ఇక మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రవాణా సౌకర్యాలను, మౌలిక వసతులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఈసారి అత్యంత అట్టహాసంగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర నిర్వహించనుండగా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా జాతర ఘనంగా జరగాలని ప్లాన్ చేసింది. ఈసారి మేడారం జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యంలో మంత్రుల సీతక్క, కొండ సురేఖలు జాతర ఏర్పాట్లను, జాతర పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే మేడారం మహా జాతరలో ఎవరు హలాల్ చేయకూడదని, మేడారం మహా జాతరలో హలాల్ చేయడం నిషేధం అని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరలో హలాల్ చేస్తే అమ్మవారికి చెల్లదు ఆయన పేర్కొన్నారు.
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు హలాల్ చేయడం విరుద్ధమని సిద్దబోయిన అరుణ్ తెలిపారు. మేడారం వచ్చే భక్తులంతా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను తప్పక గౌరవించాలని ఆయన కోరారు. ఎవరైనా హలాల్ చేస్తే అస్సలే రావద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications