నీకు చేతకాకుంటే రాజీనామా చెయ్ రేవంత్.. నేను సీఎంగా చేసి చూపిస్తా: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై, అందులో జరిగిన అవినీతిపై పదే పదే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకుని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు.
నాకు చేత కాదు నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే, తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఆ బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పైన బురద రాజకీయాలు చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికలలో లబ్ది పొందడానికి ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ పవిత్రతను, సాంప్రదాయాలను మంట కలుపుతున్నారు అని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత తక్కువ చేసి చూపించినప్పటికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని, ప్రజలకు జీవధార అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు.
విచారణ జరిపి అవకతవకలు జరిగితే బాధ్యులను శిక్షించాలని హరీష్ రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తిచేసి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Live: Former Minister, MLA Sri @BRSHarish addressing the media at Telangana Bhavan. https://t.co/9DecUS86GA
— BRS Party (@BRSparty) February 14, 2024
రెండు పిల్లర్లు కుంగాయి అన్న వంకతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఇమేజ్ ను డ్యామేజ్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు అని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు రీ ఇంజనీరింగ్ వల్లనే పెరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యాన్ని పెంచామని , కొత్త జలాశయాలను ప్రతిపాదించామని ఈ క్రమంలోనే అంచనాలు పెరిగాయని పేర్కొన్న హరీష్ రావు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు.
-
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications