మామ ప్రభుత్వంలో అల్లుడు.. రెండోసారి మంత్రిగా హరీశ్ రావు ప్రస్థానం

Recommended Video

    రెండోసారి మంత్రిగా హరీశ్ రావు ప్రస్థానం|Harish Rao Profile As Second Time Minister In TRS Government

    హైదరాబాద్ : మామ బొమ్మెస్తే అల్లుడు రంగేస్తారు. మామ దర్శకత్వంలో అల్లుడు క్షేత్రస్థాయిలో పనులు చక్కబెట్టేస్తారు. మామ చెప్పిందే వేదంగా అల్లుడు అలా అల్లుకుపోతారు. అంతలా మామా అల్లుళ్ల మధ్య బంధం పెనవేసుకుంది. మామ కేసీఆర్ ఐతే.. అల్లుడేమో హరీశ్ రావు. వీరిద్దరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. మామలోని రాజకీయ లక్షణాలను అంది పుచ్చుకున్న మేనల్లుడు హరీశ్ రావు.. మామ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దరిమిలా రెండోసారి మంత్రిగా కొలువుదీరిన హరీశ్ రావు పొలిటికల్ ప్రస్థానంపై వన్‌ఇండియా తెలుగు స్పెషల్ స్టోరీ.

    మామకు తగ్గ అల్లుడు.. అప్పుడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..!

    మామకు తగ్గ అల్లుడు.. అప్పుడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..!

    సీఎం కేసీఆర్‌కు స్వయానా మేనల్లుడు హరీశ్ రావు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీకి తొలినాళ్ల నుంచి అండదండగా ఉంటున్నారు. మామ కేసీఆర్ సలహాలు, సూచనలతో టీఆర్ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా చేశారు. ప్రతిపక్షం అనే ఊసు లేకుండా ఈ ఇద్దరు మామా అల్లుళ్లు వేసిన స్కెచ్ అందరికి తెలిసిందే.

    మామకు, అల్లుడికి పడందట. అందుకే మంత్రివర్గంలో చోటు లేదంట.. హరీశ్ రావు వేరే పార్టీలోకి పోతున్నారంట.. లేదంటే కొత్త పార్టీ పెడుతున్నారంట. నిన్న మొన్నటి వరకు ఇలాంటి మాటలకు కొదువ లేదు. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చాక కొలువుదీరిన మంత్రివర్గంలో హరీశ్ రావు లేరు కాబట్టి అలాంటి వాదనలు కొకొల్లలు. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావుకు మంత్రి పదవి కట్టబెట్టారు మామ కేసీఆర్.

    రాజకీయ ప్రస్థానం ఇలా.. ది బెస్ట్ లీడర్

    రాజకీయ ప్రస్థానం ఇలా.. ది బెస్ట్ లీడర్

    హరీశ్ రావు మాట తీరు ఎవరినైనా ఆకట్టుకుంటుంది. సౌమ్యుడిగా పైకి కనిపించినా.. ఆయనలోని పొలిటికల్ యాంగిల్‌ను ఎవరూ టచ్ చేయలేరేమో. అందరితో నవ్వుతూ కలగోలుపుగా మాట్లాడే హరీశ్ రావుకు సిద్ధిపేట నియోజకవర్గంలో మంచి పేరుంది. ది బెస్ట్ ప్రజా ప్రతినిధిగా తన అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకు ఏ పని కావాలన్నా చేసి పెడతారనే పేరుంది.

    32 సంవత్సరాలకే సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు హరీశ్ రావు. ఉద్యమ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ నుంచి తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అలా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో కేసీఆర్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ క్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేశారు. దాంతో హరీశ్ రావు రంగంలోకి దిగి ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి దశ పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

    రికార్డులు బ్రేక్.. బంపర్ మెజార్టీలే

    రికార్డులు బ్రేక్.. బంపర్ మెజార్టీలే

    2004 నుంచి 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకు మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు హరీశ్ రావు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. సిద్దిపేట అంటే హరీశ్ రావు.. హరీశ్ రావు అంటే సిద్దిపేట అనే రీతిలో ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందుతుండటం విశేషం. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95 వేల ఓట్ల మెజార్టీ సాధించి.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ఆర్ సాధించిన 68 వేల ఓట్ల మెజార్టీని బద్దలు కొట్టారు. అలా 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీ సాధించి సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో తనకు తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

    హరీశ్ రావు పొలిటికల్ ఎంట్రీ..

    హరీశ్ రావు పొలిటికల్ ఎంట్రీ..

    1972, జూన్ 3వ తేదీన చింతమడకలో లక్ష్మిబాయి, సత్యనారాయణ రావు దంపతులకు జన్మించారు హరీశ్ రావు. గ్రాడ్యుయేట్ అయిన హరీశ్ రావు తన చదువు పూర్తి కావడంతోనే డైరెక్టుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉద్యమంలో యువ శక్తిని ముందుకు నడిపించడంలో క్రియాశీలకంగా వ్యహరించారు.

    2014లో తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి బంపర్ మెజార్టీ సాధించిన తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిపి 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో హరీశ్ రావుకు మంత్రి పదవి దక్కలేదు. కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా అదంతా కేసీఆర్ ప్లాన్ అంటారు కొందరు. అందుకే అలా మేనల్లుడిని, కొడుకును పక్కన పెట్టి కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం వారిద్దరికీ మంత్రి పదవులు ఖాయం చేశారు కేసీఆర్.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+