తెలంగాణా శాంతి భద్రతలపై రేవంత్ రెడ్డి సర్కార్ ను ఏకిపారేసిన హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుతం శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి గత వారం రోజులుగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణా శాంతి భద్రతలపై హరీష్ రావు పోస్ట్
గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా శాంతిభద్రతల పరిస్థితి పైన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన హరీష్ రావు రేవంత్ ప్రభుత్వ అసమర్థ పాలన పైన, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దారుణ ఘటనల పైన విమర్శలు గుప్పించారు.

Harish Rao targets Revanth Reddy govt with the recent murders and rape incidents

వారం రోజుల్లో జరిగిన దారుణ ఘటనల ఏకరువు
గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారని హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ లో కూడా సమీర్ అనే యువకుడిని అందరూ చూస్తుండగా దారుణంగా పొడిచి చంపారని వెల్లడించారు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపైన డ్రైవర్ అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో దారుణాలకు అద్దం పడుతుందన్నారు.

ఎస్సై మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం.. చర్యలు తీసుకోవాలన్న హరీష్
ఇక తాజాగా రక్షించాల్సిన పోలీసు తోటి మహిళా కానిస్టేబుల్ పై పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగడం అత్యంత హేయమైన చర్యని హరీష్ రావు వెల్లడించారు. ఇక ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణ ఘటనపైన ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు తెలిపారు.

ప్రభుత్వం కళ్ళు తెరవాలన్న హరీష్ రావు
ఇక ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని హరీష్ రావు రేవంత్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆందోళనకరంగా మారుతున్న శాంతి భద్రతల విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+