హైదరాబాద్ నివాసులకు GHMC గుడ్ న్యూస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీపి కబురు వినిపించింది. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను ఇప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా పొందవచ్చని తెలిపింది. గతంలో ఈ సర్వీసులు మీసేవ కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉండేవి. దీన్ని మరింత విస్తరింపజేసింది. ఇకపై జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆస్తి పన్నులను చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులను పొందవచ్చు.
డిజిటల్ పరిపాలన దిశగా జీహెచ్‌ఎంసీ ఓ ముఖ్యమైన అడుగు వేసినట్టయింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి వద్ద నుండే ఈ సేవలను పొందడానికి ఇది వీలు కల్పించినట్టయింది. జీహెచ్‌ఎంసీ వెబ్ సైట్ ను సందర్శించిన తర్వాత తొలుత దరఖాస్తుదారులు తమ పీటీఐఎన్/టిన్/వీఎల్టీఎన్ వివరాలను సమర్పించాలి. తాము ఎటువంటి సర్వీసులను కోరుకుంటోన్నారనేది ఎంపిక చేసుకోవాలి. సేల్ డీడ్, ఇతర అవసరమైన సపోర్ట్ డాక్యుమెంట్లను నేరుగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.

దరఖాస్తులు సమర్పించిన తర్వాత.. అవి వెరిఫికేషన్, ఇతర అవసరమైన ఆమోదం కోసం సంబంధిత జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులకు పంపిస్తారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ సేవల్లో ప్రాపర్టీ ట్యాక్స్/ ఖాళీ స్థలం పన్ను ఆన్‌లైన్ మ్యుటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ బ్లాక్ చేయవచ్చు. నకిలీ PTIN, కూల్చివేతకు గురైన ఆస్తులు, నిర్మాణంలో ఉన్న కొత్త నిర్మాణం మొదలైనవి.. దీని పరిధిలోకి వస్తాయి. ఖాళీ స్థలం పన్ను సంఖ్యను బ్లాక్ చేసే వీలుంది. నకిలీ వీఎల్టీఎన్, కొత్తగా నిర్మాణం పూర్తయిన ప్రాపర్టీ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
అలాగే- ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ బ్లాక్ చేయవచ్చు. మూసివేసిన వ్యాపారానికి సంబంధించిన నంబర్లు లేదా నకిలీ ట్రేడ్ మొదలైనవి.. దీని పరిధిలోకి వస్తాయి. గతంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సేవల్లో ప్రాపర్టీ పన్ను సెల్ఫ్- అసెస్మెంట్, ప్రాపర్టీ పన్ను సవరణ, మినహాయింపు అసెస్మెంట్, మొబైల్ నంబర్ అప్‌డేట్, ప్రాపర్టీ పన్నులో ఇంటి నంబర్ దిద్దుబాటు, ప్రాపర్టీ పన్నులో యజమాని పేరు దిద్దుబాటు, ఖాళీ తగ్గింపు వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications