హైదరాబాద్‌లో భారీ హవాలా రాకెట్: గుజరాత్ వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టయింది. బడా వ్యాపారులకు హవాలా రూపంలో డబ్బులు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ను పోలసులు అరెస్టు చేశారు.
పటేల్ గుజరాత్‌కు చెందినవాడని సమాచారం. అతని నుంచి పోలీసులు కోటీ 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఐటి అధికారులు పోలీసుల సాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు.

గుజరాత్‌కు చెందిన పటేల్ తన హవాలా రాకెట్ ద్వారా బడా వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications