HBD CM KCR: ఉద్యమ యోధుడిగా మొదలై దేశ్ కీ నేతగా.. అనన్య సామాన్యం!!

తెలంగాణ రాష్ట్ర ఉద్యమనేతగా టీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో రెండో దశ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌తో జాతీయ నేతగా ఎదిగారు.

కేసీఆర్ .. సామాన్యుడిగా వచ్చి రాజకీయాలలో అనన్య సామాన్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్ కు సాటి మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసి దేశం దృష్టి తెలంగాణపై పడేలా చేసిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటినుండి ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్ని ఇన్ని కావు. టిఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి తెలంగాణ రాష్ట్ర సాధన నుండి ఇప్పుడు జాతీయ రాజకీయాల లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ సాగించిన ప్రస్థానం ఆయన పుట్టినరోజు స్పెషల్.

రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ కేసీఆర్ .. టీఆర్ఎస్ ఏర్పాటు

రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ కేసీఆర్ .. టీఆర్ఎస్ ఏర్పాటు

రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కేసీఆర్ తట్టుకుని నిలబడ్డారు. అవమానాలను భరించారు. తనకు అవకాశాలు రాలేదని కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో రాజకీయాలలో ముందుకు సాగారు. మొదట కాంగ్రెసులో, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో కొనసాగిన కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మంత్రి పదవికి ఇవ్వకపోవడంతో పార్టీ నుండి బయటికి వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న నినాదంతో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు కేసీఆర్.

తెలంగాణా సిద్ధాంత కర్త జయశంకర్ బాటలో కేసీఆర్ ఉద్యమ ప్రస్తానం

తెలంగాణా సిద్ధాంత కర్త జయశంకర్ బాటలో కేసీఆర్ ఉద్యమ ప్రస్తానం

కెసిఆర్ రాజకీయాలను టిఆర్ఎస్ ఏర్పాటుకు ముందు టిఆర్ఎస్ ఏర్పాటు తరువాత రెండు భాగాలుగా చూడాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ ఏర్పాటుకు ముందు కెసిఆర్ రాజకీయంగా ఎదిగినప్పటికీ తెలంగాణ సమాజంలో ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ టిఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంతో ముందుకు నడిచిన ఆయన తెలంగాణ ప్రజలందరికీ ఆత్మబంధువయ్యారు. 2001లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర సాధన కూడా అసాధ్యం కాదని ఆయన నమ్మారు. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ చూపిన మార్గంలో రాష్ట్ర సాధన కోసం ముందుకు నడిచారు.

ఒక పక్క ఉద్యమం.. మరోవైపు రాజకీయం

ఒక పక్క ఉద్యమం.. మరోవైపు రాజకీయం

తొలి దశ ఉద్యమం అంతగా సక్సెస్ కాలేకపోవడానికి వెనుక కారణాలను అధ్యయనం చేసి, మలిదశ ఉద్యమంలో మెరుపు వేగంతో ముందుకు నడిచారు. ఒకపక్క ఎంపీగా, మంత్రిగా పనిచేసినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. టిఆర్ఎస్ పార్టీతో 2004 ఎన్నికలలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు కేసీఆర్. ఐదుగురు లోక్సభ సభ్యులు ఉన్న టిఆర్ఎస్, కాంగ్రెస్ నేపథ్యంలోని యూపీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది. ఫలితంగా టిఆర్ఎస్ నాయకులైన కెసిఆర్, ఆలే నరేంద్ర లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరికింది. కెసిఆర్ కు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసిఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు, లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి యూపీఏ నుండి బయటకు వచ్చారు.

రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు..

రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు..

ఆపై మళ్ళీ ఉప ఎన్నికలలో మళ్లీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో కూడా మళ్లీ రాష్ట్రమంతటా టిఆర్ఎస్ సభ్యులు రాజీనామాలు చేసి మళ్లీ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. అప్పుడు కూడా కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా, ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించి ఆయనకు పట్టం కట్టారు. టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన నాటినుండి కెసిఆర్ తన రాజకీయ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా రాజకీయాలు నెరపారు.

తెలంగాణా గతిని మార్చి, కేంద్రాన్ని కదిలించిన కేసీఆర్ ఆమరణ దీక్ష

తెలంగాణా గతిని మార్చి, కేంద్రాన్ని కదిలించిన కేసీఆర్ ఆమరణ దీక్ష

ఇక తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర గతిని మార్చేసింది. పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న కేసీఆర్ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తరువాతఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డిసెంబర్ 1వ తేదీన నేను లేకున్నా సరేఉద్యమం నడపాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన పార్లమెంట్లో కేసీఆర్ సాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అద్వానీ ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించటంతో కెసిఆర్ నుహైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర : మొండిగా పోరాటం

తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర : మొండిగా పోరాటం


డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర అని కెసిఆర్ ప్రకటించారు. ఎంతమంది దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినాససేమిరా అన్నారు కేసీఆర్.తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో సబ్బండవర్ణాలు ఏకమయ్యాయి. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. తెలంగాణనుఏకతాటి మీదకు తీసుకువచ్చినకేసీఆర్చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచిపోయింది. దీక్షా దివస్ తెలంగాణా సాధనకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణా ఉద్యమంలో చరిత్ర లిఖించిన రోజు కెసిఆర్ దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఊతమయ్యింది.60 ఏళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని లక్ష్యసాధన దిశగా తీసుకువెళ్ళింది. బంగారు తెలంగాణ సాకారానికి కారణమయ్యింది.

తెలంగాణా రాష్ట్రం సాకారం.. సీఎంగా కేసీఆర్ తెలంగాణా ప్రజల పట్టం

తెలంగాణా రాష్ట్రం సాకారం.. సీఎంగా కేసీఆర్ తెలంగాణా ప్రజల పట్టం


కెసిఆర్ సాగించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా డిసెంబర్ 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రికొణిజేటిరోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాయి.డిసెంబర్ 8వ తేదీన తెలంగాణరాష్ట్ర ఏర్పాటు దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా సోనియాగాంధీ సూచన మేరకు నాటి కేంద్రహోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటన చేశారు. నాటి తెలంగాణా పోరాటం కేంద్రాన్ని తలొంచేలా చేసింది. ఒక్కడిగా ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ రెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టి విజయ కేతనం ఎగురవేసిన కేసిఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ తో ఇప్పుడు దేశ్ కీ నేతగా ప్రస్తానం మొదలు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+