వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడు

|
Google Oneindia TeluguNews

నాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్నారు. నిందితుడి వద్ద నుంచి నగలు, ఐ ప్యాడ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

మన్సూరాబాద్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళ కార్పొరేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఇదివరకు పెళ్లైన మనస్పర్థల వల్ల భర్త నుంచి విడిపోయి వేరుకు ఉంటోంది. ఒంటరిగా ఉంటోన్న కూతురుని పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో అంగీకరించింది. ఇదే ఆమె పాలిట శాపమైంది. షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో పేరును రిజిస్టర్ చేసుకొంది. కోయంబత్తూరుకు చెందిన యువరాజ్ మురుగేషన్ పెళ్లి ప్రతిపాదన పంపాడు.

వ్యాపారాల పేరుతో మోసం ..?

వ్యాపారాల పేరుతో మోసం ..?

స్క్రాపు వ్యాపారం చేసే మురుగేశన్ తనకు చెన్నై, బెంగళూరులో వ్యాపాలున్నాయని నమ్మించాడు. గతనెల 24న హైదరాబాద్ వచ్చి .. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద ఆమెను కలిశాడు. ఈ సందర్భంగా వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామని చెప్పగా, విడాకులకు సంబంధించిన పత్రాలు రాకపోవడంతో మహిళ వాయిదా వేస్తూ వస్తోంది.

అదనుచూసి చోరీ

అదనుచూసి చోరీ

తర్వాత గతనెల 30న మరోసారి మహిళ ఇంటికొచ్చి .. పెళ్లికి సంబంధింని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. తనకు తెలిసిన జ్యోతిషుడు సూచించాడని ఓ పసుపుతాడు ఆమె చేతికి కట్టాడు. ఆమె మెడలో ఉన్న బంగారు తాళి తొలగించాలని ఒత్తిడి చేశాడు. తాను తీసుకొచ్చిన నకిలీ హారాన్ని ఆమె మెడల్ వేశాడు. బంగారు గాజులు కూడా తీయించాడు. వాటిని టేబుల్‌పై పెట్టి మొహం కడుక్కొని రావాలని లోనికి పంపించాడు. ఆ తర్వాత మెల్లగా ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి ఆధునాతన సాంకేతిక పరిజానంతో పట్టుకొన్నారు. కోయంబత్తూరులో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితుడి వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకున్నారు.

English summary
The police made a play of a pedestrian who told him to marry and woke up with jewels. The accused using technology is caught on mobile basis. Jewelry, I Pad and cellphone were seized from the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X