బీ అలర్ట్.. వచ్చే మూడు గంటలు భారీ వర్షం, పిడుగులకు ఛాన్స్..!!
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి వర్షం దంచికొట్టింది. గురువారం వరకూ 40డిగ్రీలకు పైన ఎండలు మండిపోయాయి. అనూహ్యంగా అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రేపు కూడా పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో వచ్చే మూడు గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అలర్జ్ జారీ చేసింది.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం.. ఇటు టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం కురుస్తోంది. గురువారం నగరంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజానికానికి నేడు కురిసిన వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన వర్షం మరి కొద్ది గంటలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

మరో మూడు గంటల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నాగర్ కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నారాయణపేట్ జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, లకడీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ దాదాపు భాగ్యనగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది.
ఈరోజు రేపు కూడా పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే మూడు నాలుగు రోజులు బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 17న పశ్చిమ బెంగాల్‌లోని గంగానది పరివాహాక ప్రాంతాల్లో, ఏప్రిల్ 15న ఏపీలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిశాలో, ఏప్రిల్ 15 నుంచి 17 వరకు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని సెంట్రల్, ఈస్ట్, నార్త్‌వెస్ట్‌లోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications