వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో క్లౌడ్ బరస్ట్.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక హైదరాబాదులో క్లౌడ్ బరస్ట్ ఏర్పడినట్టు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితి పైన సమీక్షించారు.

భారీ వర్షాలకు హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అప్రమత్తమైన ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. వర్షాల కారణంగా ప్రజలకు తలెత్తే ఇబ్బందులను కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వెంటనే అధికారుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని పేర్కొంది.

heavy rains Cloud burst in Hyderabad These are the emergency numbers

కంట్రోల్ రూమ్ నెంబర్లకు కాల్ చెయ్యండి: కలెక్టర్ హరి చందన
వర్షాల కారణంగా ఇళ్లల్లోకి నీళ్ళు చేరడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, విద్యుత్ సమస్యలు తలెత్తితే ప్రజలు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040 2302813 లేదా 7416687878కు కాల్ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. భారీ వర్షాలతో, వరద ముంచెత్తిన ప్రాంతాలలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.

అధికారుల సెలవులు రద్దు
అలాగే, రెవెన్యూ అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో వర్ష సంబంధిత సహాయం కోసం ప్రజలు సంప్రదించాల్సిన ముఖ్యమైన ఫోన్ నెంబర్ల వివరాలను అందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం కోసం: 8333068536,
ఐసీసీసీకి ఫిర్యాదు చేయడానికి: 8712596106,
హైడ్రా సహాయం కోసం: 9154170992,
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహాయం కోసం : 8712660600
రాచకొండ ట్రాఫిక్ పోలీసుల సహాయం కోసం: 8500411111 , 8712662999,

ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయండి
ఇక విద్యుత్ సమస్యల కోసం: 7901530966,
RTC కోసం: 9444097000,
GHMC కోసం 8125971221,
HMWSSB కోసం 9949930003కు సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో సహాయం కోసం ప్రజలు ఈ ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+