హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు, ఇళ్లల్లోకి భారీ వరద, వాహనాలు కొట్టుకుపోయాయి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి వరదనీరు భారీగా చేరుకుంది.

వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఆర్సీపురం, రాజేంద్రనగర్, బండ్లగూడ, గొల్కొండ, నార్సింగి, పుప్పాలగూడ, మైలార్ దేవులపల్లి, మణికొండ, గండిపేట, షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షంతో జనం అవస్థలు

రోడ్లపైకి వరదనీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కొందరైతే తమ నివాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

జనావాసాల్లోకి వరద

మహబూబ్ నగర్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల, గద్వాల్ జిల్లాల్లోనూ బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై వరద నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరో మూడురోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

కాగా, మరో మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

English summary
Heavy rains in Hyderabad and telangana districts: vehicles washed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X