మూసీ ఉగ్రరూపం.. నీటమునిగిన MGBS, సీఎం కీలక ఆదేశాలు !!

హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఎంజీబీఎస్‌లోకి మూసీ ప్రవాహం..

ఈ క్రమంలోనే గండిపేట నుంచి నాగోలు వరకు మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్ మొత్తం నీట మునిగిపోవడంతో వందలాది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బస్టాండ్‌లోని వాహనాల కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు.

heavy-rains-leads-to-moosi-water-enter-into-mgbs-in-hyderabad

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..

పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్‌లో చిక్కుకున్న ప్రయాణికులను వెంటనే బయటకు తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అర్థరాత్రి స్వయంగా ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భారీ ఎత్తున వరద నీరు..

మరోవైపు మూసీ వరద కారణంగా ఛాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జ్‌పై 6 అడుగుల ఎత్తులో.. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. వంతెన నిర్మాణ పనులకు సిద్ధం చేసిన స్లాబ్‌ సామాగ్రి కూడా వరదలో కొట్టుకుపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ వంతెనలను మూసివేసి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అలానే పురానాపూల్-జియాగూడ 100 ఫీట్ రోడ్డు కూడా తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనాదారులు ఎటు వెళ్లాలో తెలియక పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇక చాదర్‌ఘాట్‌ సమీపంలోని మూసానగర్‌లో సుమారు 200 ఇళ్లు నీట మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని ప్రజలు ఇళ్లను వదిలి రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా నగరంలోని ప్రధాన రహదారులు వరద నీటితో నిండిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు గృహాలు వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+