Rains: వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. మంగళవారం ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో పలు జిల్లాల్లో మంగళవారం భారీ వానలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. సోమవారం తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్ లో కూడా తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. వర్షాల నేపథ్యంలో అత్యవసరం ఉంటనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఆదివారం సాయింత్ర హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, కోఠి, సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, బేగంపేట, సనత్ నగర్, మోతీనగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, యూసుఫ్ గూడ, నారాయణ గూడ, బహదూర్ పల్లి, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, మాదాపూర్, బోరబండ, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాయదుర్గంలో వర్షం కురిసింది.

వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లుపైకి నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మంచిర్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో వాన కురిసింది.
అత్యధికంగా సంగారెడ్డి జిల్లా జన్నారంలో 4 సెంటీమీటర్ల వాన పడింది. మేడ్చల్ 3.7 సెంటీమీటర్లు, ఆలియాబాద్ లో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇంత వర్షం కురిసినా.. గత సంవత్సరం కంటే తక్కువ వర్షపాతమే నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే వర్షపాతం 19 శాతం తక్కువగా ఉందని తెలిపారు. జులైలో నిర్మల్ మండలంలో అత్యధికంగా 16.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications