చార్జ్ షీట్ లో పేరు ఉండటంపై నటి హేమ చెప్తుంది వింటే షాక్ పక్కా!
బెంగళూరు రేవు పార్టీ కేసులో చార్జిషీట్లో నటి హేమ పేరు పోలీసులు చేర్చడంతో నటి హేమకు షాక్ తగిలినట్టు అయింది. హేమతో పాటు మరో 88 మందిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 1086 పేజీల్లో నమోదు చేసిన చార్జిషీట్లో నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్ కు జోడించారు పోలీసులు.
డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఇక ఈ క్రమంలో చార్జి షీట్లో తన పేరు రావడం పైన నటి హేమ స్పందించారు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన హేమ తాను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని బెంగళూరు పోలీసుల చార్జిషీట్లో నా పేరు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందని, నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ మళ్లీ పాత పాటే పాడారు పోలీసులు.

డ్రగ్స్ రిపోర్ట్ లో తనకు నెగిటివ్ వచ్చింది
ఛార్జిషీట్ నాకు వచ్చాక నేను దీనిపైన స్పందిస్తానని నటి హేమ తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం డ్రగ్స్ రిపోర్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందని చార్జిషీట్లో రాసారని హేమ తెలిపారు. తాను ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకోలేదని కొన్ని మీడియా సంస్థలు వల్లనే నా పేరు చార్జిషీట్లో పెట్టినట్టుగా తనకు అనిపిస్తుందని నటి హేమ వెల్లడించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని హేమ తెలిపారు.
రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్న హేమ
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో రేవ్ పార్టీ జరిగిన రోజు నుంచి హేమ తనకు ఈ రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూనే ఉన్నారు. ఓ పక్క పోలీసులు హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ తీసుకున్నారని పదేపదే చెబుతున్నప్పటికీ హేమ మాత్రం తానే తప్పు చేయలేదని చెబుతున్నారు. పోలీసులు ఆధారాలు చూపిస్తున్న సరే తాను డ్రగ్స్ తీసుకోలేదని పదేపదే బుకాయిస్తున్నారు.
ఇండస్ట్రీలో చర్చ
ఇప్పుడు చార్జిషీట్లో పేరు ఉన్నప్పటికీ తనకు ఏ సంబంధం లేదంటూ తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ హేమ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications