సెలబ్రిటీ టచ్ : బొటిక్స్ ప్రారంభోత్సవంలో హీరో నిఖిల్ సందడి.. (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : షాపింగ్ అంటే ఇష్టపడని అమ్మాయిలుంటారా..? ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యాషన్స్ మార్చడం ఈతరం అమ్మాయిలకు ఓ క్రేజీ థింగ్. ఏ విషయంలో అయినా ఆలస్యం చేస్తారు గానీ ఫ్యాషన్స్ విషయంలో నో లేట్.. అందుకే ఒక్క వీకెండ్స్ మాత్రమే కాదు నగరంలో ప్రతీరోజు షాపింగ్స్ కళకళలాడుతూనే ఉంటాయి.

బొటిక్స్.. యువత మెచ్చే ఫ్యాషన్స్ కు ఇప్పుడో కేరాఫ్. అందుకే నగరంలోను విభిన్న తరహాలో కొత్త కొత్త బొటిక్స్ ఏర్పాటవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో కొత్తగా ఏర్పాటైన బొటిక్ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరో నిఖిల్, హీరోయిన్ గాయత్రీ గుప్తా సెలబ్రిటీ టచ్ తోడవడం.. బొటిక్ ప్రారంభోత్సవానికి ప్రధాన ఆకర్షణగా మారింది.

సెలబ్రిటీ మంత్రా :

సెలబ్రిటీ మంత్రా :

విషయమేదైనా.. దానికి సెలబ్రటీ టచ్ తోడైతే త్వరగా జనాల్లోకి వెళ్లగలుగుతుంది. అందుకే నగరంలో కొత్తగా ఏర్పాటయ్యే మాల్స్, బొటిక్స్ సెలబ్రిటీ మంత్రాను జపిస్తున్నాయి.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

శ్రీనగర్ కాలనీలో కొత్తగా ఏర్పాటైన బొటిక్స్ ప్రారంభోత్సవంలో హీరో నిఖిల్, హీరోయిన్ గాయత్రీ గుప్తా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

నిర్వాహకులతో ఫోటోకు పోజు

నిర్వాహకులతో ఫోటోకు పోజు

నిఖిల్, గాయత్రీ గుప్తాలతో పాటు ఆర్.జే శేఖర్ భాషా కూడా బొటిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇదిగో అందరూ కలిసి ఇలా.. ఫోటోకు పోజులిచ్చారు.

సెలబ్రిటీ వర్డ్స్

సెలబ్రిటీ వర్డ్స్

షాపింగ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు హీరో నిఖిల్. ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన నిఖిల్.. షాపింగ్స్ చేస్తూ ఫ్యాషన్స్.. ఎప్పటికప్పుడు ఫాలో అవుతానని చెప్పుకొచ్చాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hero Nikhil and Heroine Gayatri Gupta participated in a Boutique Inaguaration held srinagar colony hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి