డ్రగ్స్ కేసులో స్టార్ హీరో డ్రైవర్: సిట్ కస్టడీకి కెల్విన్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇతడ్ని రెండురోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు.

ప్రముఖ మీరో డ్రైవర్‌కు లింకులు

ప్రముఖ మీరో డ్రైవర్‌కు లింకులు

ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి సరఫరా చేస్తున్న కెల్విన్ కాల్ లిస్టు ఆధారంగా 12మంది సినీమ ప్రముఖులకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సినీనటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం గమనార్హం. ఇతనికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు సమాచారం. దీంతో ఇతడ్ని కూడా పోలీసులు విచారించనున్నారు.

Navadeep in Drugs Scandal, Top Tollywood Actors Trying to Save him
సినీ ప్రముఖులు..

సినీ ప్రముఖులు..

ఇప్పటికే కెల్విన్ కాల్ లిస్టులో సినీ ప్రముఖులు ఉండటం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో తేలినప్పటికీ.. తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి చేసి వారు సైడ్ అయినట్లు తెలుస్తోంది. కాగా. మొత్తం 23మంది సినీ ప్రముఖుల పేర్లు కెల్విన్ కాల్ లిస్టులో ఉన్నట్లు సమాచారం.

సిట్ విచారణకు..

సిట్ విచారణకు..

ఇక నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు జులై 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో, మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.

సెలవులు రద్దు..

సెలవులు రద్దు..

ఇది ఇలా ఉండగా, డ్రగ్స్ కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెలవులపై వెళ్లాల్సిన ఎక్సైజ్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్నారు. కేసు కీలక దశలో ఉండటంతో ఈ సమయంలో సెలవులు పెట్టడం సరికాదని ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్నుంచి ఈ కేసును ఆయనే పర్యవేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The main persons whose names are heard repeatedly in drug mafia are Kelvin who has completed B tech and worked in a bank and Jason who completed graduation and worked as a manager in a hotel.
Please Wait while comments are loading...