వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగ్గుమన్న జనగామ, ప్రత్యేక జిల్లా డిమాండ్ : బస్సులు దగ్ధం (పిక్చర్స్ )

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 25 జిల్లాలను ఖరారు చేయడంతో.. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిథులు తమ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల కోసం పట్టుబడుతున్నారు.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామను, అలాగే దక్షిణ తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని గద్వాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు జనగామ, గద్వాలలో జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళనలు నిర్వహించగా.. అవి కాస్త ఉద్రిక్తలకు దారి తీశాయి.

జనగామలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. పలు వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేయడంతో జనగామలొ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సుమారుగా 20 కి పైగా ప్రైవేటు, ఆర్టీసీ వాహనానాలను ఆందోళనకారులు ధ్వంసం చేసినట్టుగా సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ చార్జీ చేసిన పోలీసులు ఆందోళన చేస్తోన్న జేఏసీ నేతలను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

ఇక మహబూబ్ నగర్ లో గద్వాలను కూడా ప్రత్యేక జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్ ఆందోళనకు దిగారు. ఎర్రవలి చౌరస్తాలో పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రహదారి పొడుగునా హహనాలు నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేతలను వారించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు డీకే అరుణ, సంపత్ కుమార్ లను అరెస్టు చేసినట్టు సమాచారం.

ఆందోళనల

ఆందోళనల

ప్రత్యేక జిల్లా ఆందోళనల నేపథ్యంలో జనగామ అట్టుడుకుతోంది. ఆందోళనలకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తలకు దారి తీశాయి.

ఆందోళనకారులు

ఆందోళనకారులు

రోడ్డెక్కిన ఆందోళనకారులు ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూ.. ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు వాళ్లను అడ్డగించే ప్రయత్నం చేయడంతో.. ప్రతిఘటించిన ఆందోళనకారులు పోలీసుల పైకి రాళ్లు విసిరారు.

ఆర్టీసీ వాహానాలకు

ఆర్టీసీ వాహానాలకు

ఆందోళనకారులు పలు ప్రైవేటు, ఆర్టీసీ వాహానాలకు నిప్పంటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సుమారు 20 హహానాల వరకు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది.

జేఏసీ

జేఏసీ

ఆందోళన నేపథ్యంలో జేఏసీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

తీవ్ర రూపం

తీవ్ర రూపం

ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో జనగామలో ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆందోళనలతో జిల్లా పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయినట్టు సమాచారం.

English summary
In Telangana now it is the turn of seperate districts demands by political leaders in their region. Congress MLA DK Aruna, and MLA Samapth kumar arrested in gadwal during the rally for seperate district of Gadwala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X