హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నల్గొండలో మేమే: జానా రెడ్డి, ఓటింగ్ కేంద్రంలోనే అరగంటపాటు మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు జిల్లాల్లో కలిపి 98.47 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అత్యధిక పోలింగ్‌ శాతం రంగారెడ్డి జిల్లాలో, తక్కువగా ఖమ్మం జిల్లాలో నమోదైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. 12 స్థానాలకుగాను కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లోని ఆరు స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

మిగతా స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన 11 మందిని ఆయా పార్టీలు సస్పెండ్‌ చేశాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు


నాలుగు జిల్లాల పరిధిలో 3,867 మంది ఓటర్లకుగాను 3,817 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

సూర్యాపేట పోలింగ్‌ కేంద్రంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అరగంట పాటు ఉన్నారంటూ కాంగ్రెస్‌, టిడిపి నేతలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

 ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

అనంతరం మంత్రి కేంద్రం నుంచి వెళ్లిపోవటంతో ధర్నాను విరమించారు. గద్వాల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే డీకే అరుణ, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ మధ్య వాగ్వాదం జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

మహబూబ్‌నగర్‌ నుంచి మండలి అభ్యర్థిగా పోటీలో ఉన్న కొత్తకోట దయాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి గద్వాల్‌ కేంద్రంలో టిడిపి ఏజెంటుగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్నాడంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

కాగా, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని జానారెడ్డి అన్నారు.

 ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

రంగారెడ్డి జిల్లాలో 771 ఓట్లు ఉండగా 769 ఓట్లు పోలయ్యాయి. 99.7 శాతం ఓటింగ్ నమోదయింది. పాలమూరులో 1,260 ఓట్లుఉంటే 1,256 ఓట్లు నమోదయ్యాయి. 99.7 శాతం ఓటింగ్.

 ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు

నల్గొండలో 1,110 ఓట్లు ఉంటే 1,100 నమోదయ్యాయి. ఓటింగ్ శాతం 99.1. ఖమ్మంలో 726 ఓట్లు ఉంటే 692 ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్ శాతం 95.32.

English summary
High voter turnout marks mlc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X