తాతకు ప్రేమతో.. హిమాన్షు ఎమోషనల్ ట్వీట్ వైరల్!!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గులాబీ బాస్ కు బీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాతయ్య మీద ఎనలేని ప్రేమను వ్యక్తం చేసే కేసీఆర్ మనవడు హిమాన్షు కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తాతయ్య 70వ సంవత్సర శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న హిమాన్షు నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని అందించినందుకు మరియు ఈ రోజు నన్ను నేనుగా ఎదిగేలా పెంచినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
నేను ఇద్దరు గొప్పవారైన తండ్రుల వద్ద పెరిగాను అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతానని పేర్కొన్నారు. మీరిచ్చే ఆత్మవిశ్వాసం, ఆప్యాయత నిండిన మాటలతో నా ఒత్తిడి, సమస్యలు అన్ని దూరమవుతాయని హిమాన్షు పేర్కొన్నారు. కష్ట సమయాల్లో సహనం గురించి మీరు చెప్పిన తెలివైన బోధనలను నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని హిమాన్షు తెలిపారు.

అందరికంటే భిన్నంగా, అసాధారణమైన తాతగా మరియు నా నిజమైన బెస్ట్ ఫ్రెండ్ గా మీరు ఉన్నందుకు మీకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. నా కోసం మీరు చేసే ప్రతి దానికి ధన్యవాదాలు అతి పెద్ద ఖగోళ గ్రహమైన ఫ్లూటో వరకు, తిరిగి భూమి వరకు తాత పై ప్రేమ ఉందని హిమాన్షు తన ట్వీట్ ద్వారా ఎమోషనల్ అయ్యారు.
గతంలో ఎన్నికలకు ముందు తాత కోసం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టిన హిమాన్షు ఒక దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అంటూ కెసిఆర్ పరిపాలన తీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. కారే రావాలి కెసిఆరే గెలవాలి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి ప్రచారాన్ని కూడా నిర్వహించారు.
Thathaya, Happy 70th❤️
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) February 17, 2024
Thank you for giving me such a wonderful life, and raising me to be who I am today.
I always feel super proud to say that I was raised by not one but two fathers ❤️
All my stress and problems fade away with your words of confidence and affection. I’ll… pic.twitter.com/5qOxWMmpV2
ఎంతో పారదర్శకతతో మరెంతో పట్టుదలతో, తపనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపించారని తాతకు కితాబిచ్చారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవాన్ని సృష్టించిందని రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. సామాజిక సాధికారతకు, పర్యావరణ సుస్థిరతకు కెసిఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటు పడిందని, కెసిఆర్ గారి పారదర్శకత, సమర్ధత మరియు సమర్థవంతమైన పాలన యొక్క నమూనా ఇదని హిమాన్షు పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications