సీతక్క బృందంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాం: భేటీపై స్మితా సబర్వాల్ క్లారిటీ!!
స్మితా సబర్వాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. గత దశాబ్ద కాలంగా తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్. సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆమె కెసిఆర్ మెప్పు పొందిన అధికారిణిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
ఇక స్మిత సబర్వాల్ కు కేసిఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, స్మిత సబర్వాల్ ఆ వార్తలను ఖండించారు.

రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి స్మితా సబర్వాల్ ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కలిసిన దాఖలాలు లేవు. కానీ ఆమె తాజాగా మంత్రి సీతక్కతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఆమె కొన్ని ఫైళ్ళపై సీతక్కతో సంతకాలు తీసుకున్నారు. దీంతో సీతక్క నిర్వహిస్తున్న శాఖల్లో పోస్టింగ్ కన్ఫార్మ్ అయ్యిందా అన్న చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు స్మితా సబర్వాల్.
సోషల్ మీడియా వేదికగా ఆమె సీతక్కను ఎందుకు కలిశారో స్పష్టం చేశారు. మిషన్ భగీరథ సీసీ స్మితా సబర్వాల్, ఇంజనీర్-ఇన్-చీఫ్ శ్రీ జి. కృపాకర్ రెడ్డి మరియు చీఫ్ ఇంజనీర్‌లతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే నేను సీతక్కను కలిశానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Honb’le Minister for PR & RD, RWS Smt Danasari Anasuya Seethakka ma’am has conducted a review meeting with #MissionBhagiratha Secy Smita Sabharwal, Engineer-in-Chief Sri G. Krupakar Reddy and Chief Engineers.
— Mission Bhagiratha Official (@mb_telangana) December 15, 2023
We at #MissionBhagiratha are honored to be part of her team ✊🏼… pic.twitter.com/KVwKjIfnju
MissionBhagiratha కోసం మేము ఆమె బృందంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాము అంటూ స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ అఫీషియల్ ఖాతాలో చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసి తాను సీతక్కను ఎందుకు కలిశారో క్లారిటీ ఇచ్చారు. సీతక్క సమీక్షా సమావేశం నిర్వహిస్తే మిషన్ భగీరథ చూసిన అధికారిణిగా మాత్రమే ఆమె సీతక్కతో సమావేశం అయ్యారు. ఇందులో ఆమె పోస్టింగ్ కి సంబంధించి ఎలాంటి సిఫార్సు లేదని చెప్పకనే చెప్పారు స్మితా సబర్వాల్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications