‘స్పెషల్’ ఎఫెక్ట్: ఆర్టీసీకి భారీగా ఆదాయం, ఎన్ని వందల కోట్లంటే?

దసరా పండగ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)కి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ 10,512 అదనపు బస్సులను నడిపించింది. పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో ఆర్టీసీ అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీ అదనపు బస్సులను అందుబాటులో ఉంచింది.

అంతేగాక, స్పెషల్ బస్సుల పేరుతో 50 శాతం అధికంగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండగా సందర్భంగా ఏకంగా రూ. 307 కోట్ల 16 లక్షల ఆదాయం సమకూరింది. 15వ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సుమారు 707.73 లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి ఆర్టీసీ బస్సులు.

Huge income for Telangana RTC with special buses on the occasion of Dussehra

తెలంగాణ ఆర్టీసీ 10,512 అదనపు బస్సులు నడిపినప్పటికీ ప్రయాణికులు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. హైదరాబాద్ (ఎంజీబీఎస్), సికింద్రాబాద్ (జేబీఎస్) నుంచి రాష్ట్రం నలుమూలలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా ఆర్టీసీ అదనపు బస్సులు నడిపింది.

అక్టోబర్ 9, 10, 11వ తేదీల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిన విషయం తెలిసిందే. కాగా, ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక నడిపించింది.

ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను నడిపింది. ఇక, ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యం కోసం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించింది. అయితే, పురుషులకు మాత్రం సాధారణ టికెట్ ధరపై 50 శాతం ఎక్కువగా వసూలు చేయడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+