యాదాద్రి ఆలయ హుండీకి భారీ ఆదాయం...!
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం. ఈ పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడిపోయింది. వీకెండ్ కావడంతో యాదాద్రి ఆలయానికి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.
యాదాద్రి గుట్ట ఆలయం శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులతో నిండిపోయింది. భక్తులు ఉదయం నుంచే క్యూలైనల్లో బారులు తీరారు. ఇక, స్వామివారికి మొక్కుల రూపంలో కానుకలను సమర్పించుకున్నారు. గత మూడు రోజుల్లో స్వామివారిని 2 లక్షల 15 వేల మంది భక్తులు దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఖజానాకు వివిధ రూపాల్లో రూ.2.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఇక, స్వామివారి స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పడితే, ఫ్రీ దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఆలయ మండపాలన్నీ భక్తులు నిర్వహించిన మొక్కు పూజలతో సందడిగా నెలకొన్నాయి. ఇక, ఈ వీకెండ్‌లో ఉదయం నుంచి రాత్రీ వరకు ఆలయంలో విపరీతమైన రద్దీ కొనసాగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వీకెండ్‌లో రికార్డు స్థాయిలో ఆదాయం..
ఈ పుణ్యక్షేత్రానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆ ఒక్కరోజే 81 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ మాడ వీధులు, పట్టణ దారులన్నీ స్వామివారి భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. మెుత్తంగా మూడురోజుల్లో 2 లక్షల 15 వేలమంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ మూడు రోజుల్లో శ్రీ స్వామి వారి ఆర్థిత సేవలు. హుండీ ద్వారా 2 కోట్ల 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications