Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెకీ మృతికి కారణమిదే..? మరో మహిళతో విదేశాల్లో ఎంజాయ్, ప్లైట్ టికెట్, చాటింగ్..

టెకీ లావణ్య లహరి ఆత్మహత్య చేసుకోవడానికి భర్తే కారణమని తెలుస్తోంది. అతను తన కోలిగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని, లావణ్యకు దొరికాడని విశ్వసనీయంగా తెలిసింది. తర్వాత వారి మధ్య గొడవలు జరగడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై లావణ్య బలవన్మరణానికి పాల్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను వెంకటేశ్ వేధింపులకు గురిచేశామని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతని వేధింపులు భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకొంది. వాస్తవానికి అతను తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని అంశం కలవరానికి గురిచేస్తోంది.

వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం

ప్రైవేట్ విమాన సంస్థలో వెంకటేశ్వరరావు పైలట్‌గా పనిచేస్తున్నాడు. అయితే డ్యూటీ పేరుతో మరో మహిళతో కలిసి విదేశాల్లో తిరిగిన ప్లైట్ టికెట్స్ లావణ్య సంపాదించారు. వారిద్దరీ చాటింగ్ కూడా తీసుకొని.. తన ఫోన్‌లో స్టోర్ చేసినట్టు తెలిసింది. భర్తను నిలదీసి.. ఆధారాలు బయటపెట్టడంతో వెంకటేశ్వరారవు జీర్ణించుకోలేకపోయారు. భార్య అని కూడా చూడకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాడు. దారుణంగా కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. ఆ వెంటనే బిల్డింగ్ పైకి ఎక్కి చనిపోయే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న భర్త అడ్డుకోలేదు. అప్పుడు ఎలాగోలా కిందకొచ్చిన లావణ్య.. తర్వాత మాత్రం సూసైడ్ చేసుకున్నారు. ఇదేకాదు ఇదివరకు లావణ్య ప్రెగ్నెంట్ కాక కొట్టడంతోనే గర్భస్రావం అయిందని తెలుస్తోంది. ఇక అప్పటినుంచి పిల్లల పేరుతో వేధించారు.

యువతితో మాట్లాడిన లావణ్య

యువతితో మాట్లాడిన లావణ్య

సదరు యువతి గురించి లావణ్య తెలుసుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది. జీవితాన్ని నాశనం చేయొద్దు అని కోరిందని.. కానీ ఆమె వెంకటేశ్వరరావు చెప్పింది. దీంతో అతను భార్యపై మరింత రెచ్చిపోయాడు. టార్చర్ అంటే ఏంటో చూపించాడు. భర్త వేధింపులు భరించలేక లావణ్య ఉరేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వరరావు-మహిళ మొబైల్ సంభాషణలను ఆర్జీఐఏ పోలీసులు రీకవరీ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

8 ఏళ్ల వైవాహిక జీవితం.. ఇలా...

8 ఏళ్ల వైవాహిక జీవితం.. ఇలా...

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన లావణ్య లహరి, వెంకటేశ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 8 ఏళ్ల కింద వారికి పెళ్లి కాగా.. మరో మహిళ వారి జీవితంలోకి చూడటంతో గొడవలు వచ్చేవి. దంపతులు శంషాబాద్‌లో ఉంటున్నారు. లావణ్య సాప్ట్ వేర్ ఇంజినీర్ కాగా, భర్త పైలట్‌గా పనిచేస్తున్నారు. అందరూ దంపతుల మధ్య వీరి మధ్య కూడా గొడవలు ఉన్నాయి. వెంకటేశ్ తన భార్యకు టార్చర్ అంటే ఇదేనని చూపించాడు.

పెంపుడు శునకం రావడంతో..

పెంపుడు శునకం రావడంతో..

ఇటీవల ఇంట్లో భార్యపై వెంకటేశ్ దాడిచేయగా.. పెంపుడు కుక్క ఆపే ప్రయత్నం చేసింది. గొడవ అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. గొడవ తర్వాత లావణ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. అయితే అందుకు కారణం వెంకటేశ్వరరావు మరో మహిళతో వివాహేతర సంబంధ పెట్టుకోవడం.. ఇందుకు సంబంధించి ఆధారాలు సేకరించడంతో గొడవ జరిగి వివాహిత ఆత్మహత్యకు దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+