హైదరాబాద్ సిటీ టూర్.. చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు.. సూపర్ ప్యాకేజీతో!
హైదరాబాద్ అనగానే చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉంటాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నగర అందాలు చూడాలంటే ఎలా చూడాలి? అని భావించే వారి కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం హైదరాబాద్ సిటీ టూర్ ను అందిస్తోంది.
ఒక్కరోజులో హైదరాబాద్ నగర అందాలు
అతి తక్కువ ప్యాకేజ్ తో హైదరాబాద్ నగరంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాలు, చరిత్ర వాస్తు శిల్పకళ, హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలు, సినిమాల ప్రపంచం, అత్యాధునిక హైదరాబాద్ ను ఒకే రోజులో చూసే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలతో గైడ్ ను కూడా మీతో పంపిస్తూ ఒక్కరోజులోనే హైదరాబాద్ నగరాన్ని దర్శించే వీలు కల్పిస్తుంది.

హైదరాబాద్ సిటీ టూర్
హైదరాబాద్ నగర వన్డే టూర్ ప్యాకేజీని హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో టీఎస్ టూరిజం అందిస్తుంది. ఇందులో బిర్లా మందిర్, చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, బోట్ రైడ్, సిటీ వ్యూ రాత్రి లైట్స్ లో ఇలా ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ కవర్ చేసి చూపిస్తుంది.
చూసే పర్యాటక ప్రాంతాలు ఇవే
ఈ టూర్లో హైదరాబాద్ ఐకాన్ అయిన చార్మినార్ ని సందర్శించి అద్భుతమైన వాస్తు శిల్పాన్ని తెలుసుకోవచ్చు. చార్మినార్ వద్ద షాపింగ్ చేయొచ్చు. నిజాం రాజ వంశ వైభవాన్ని తెలియజేసే చౌమహల్లా ప్యాలెస్ ను చూడవచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద వ్యక్తిగత కలెక్షన్ మ్యూజియం అయిన సాలార్ జంగ్ మ్యూజియంని తిలకించవచ్చు. ఇక యుద్ధ వ్యూహాలతో, ధ్వని వ్యవస్థలతో ప్రసిద్ధి చెందిన నాటి నిజాం కాలం నాటి గోల్కొండ కోటను చూడవచ్చు.
ఏసీ, నాన్ ఏసీ బస్సులతో హైదారాబాద్ టూర్ ప్యాకేజ్
ఆ తర్వాత టీఎస్ టూరిజం అందించే ప్రత్యేక రెస్టారెంట్లలో హైదరాబాది రుచులను ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీని , స్టూడియోలు, సెట్లను సందర్శించాలి అనుకునేవారు ఈ ప్యాకేజ్ ను తీసుకోవచ్చు. అలాకాకుండా సిటీ సెంటర్ ప్యాకేజ్ తీసుకుంటే లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్ చూడవచ్చు. ఒకరోజు సిటీ టూర్ కోసం టూరిజం ఎసి బస్సులను, నాన్ ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తుంది.
ఉదయం నుండి సాయంత్రం వరకు టూర్ టికెట్ ధరలు ఇలా
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్యాకేజ్ ఉంటుంది. ఇక ఏసీ కోచ్ బస్సులలో అయితే సీజన్ ప్రకారం 600 నుంచి 800 రూపాయల వరకు టికెట్ ఉంటుంది. నాన్ ఏసీ కోచ్ లో అయితే 400 రూపాయల నుండి 500 రూపాయల టికెట్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోవాలంటే తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ పోర్టల్ లేదా యాప్ లో బుక్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం హైదరాబాద్ నగర అందాలను చూడాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజ్ ను ఎంజాయ్ చేయండి.












Click it and Unblock the Notifications