తాటతీస్తా!.. రౌడీషీటర్లకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్!

CP Sajjanar Mass Warning: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో సౌత్ వెస్ట్ జోన్‌లో ఆకస్మిక పర్యటన చేసి సంచలనం సృష్టించారు. సాధారణంగా సీపీ పర్యటన అంటే ఉండే సైరన్‌లు, ఆర్భాటం లేకుండా, ఆయన స్వయంగా పెట్రోలింగ్ వాహనంలో గస్తీ నిర్వహించారు. రాత్రి 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు కొనసాగిన ఈ పర్యటనలో ఆయన పోలీసింగ్ స్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెట్రోలింగ్ వాహనంలోనే లంగ‌ర్‌హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని వారికి సూచించారు.

లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారు, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంత‌రం.. టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి.. స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.

Hyderabad CP Sajjanar Midnight Raid Massive Warning to Rowdy-Sheeters

ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించిన ఆయన, నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+