న్యూఇయర్ పార్టీ విషాదం: ఇండోర్‌లో హైదరాబాద్ లేడీ టెక్కీ ఆత్మహత్య

హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్న కాసేటికే గత డిసెంబర్ 31న ఎత్తైన భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీరింగ్‌గా పనిచేస్తోంది. వర్క్ ఫ్రం‌హోంలో భాగంగా ఇండోర్‌లోనే ఉంటూ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహిస్తోంది.

 Hyderabad lady techie commits suicide, jumping from 7th floor of an apartment in Indore, madhya pradesh

అయితే, గత డిసెంబర్ 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఇండోర్‌లోని టుకోగంజ్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లోని 31వ అంతస్తులో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం భవనం 7వ ఫ్లోర్ నుంచి యువతి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె దగ్గర ఉన్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.. ఒత్తిడికి గురవుతున్నట్లు ఇంగ్లీష్‌లో రాసింది. ఈ కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్నేహితులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఘటనపై ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+