ఆకాశంలో ఉండగా విమానం డోర్ తెరిచే యత్నం: హైదరాబాదీ అరెస్ట్

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో పలువురు ప్రయాణికులు తమ ప్రవర్తనతో తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరికొందరైతే ప్రమాదకర రీతిలో ప్రవర్తిస్తూ హడలెత్తిస్తున్నారు. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు కూడా కొందరు ప్రయత్నించడం గమనార్హం. తాజాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రయాణికుడు కూడా ఇలానే ప్రవర్తించి, చివరకు కటకటాలపాలయ్యాడు.

మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ నగరంలోని గాజులరామారానికి చెందిన జిమ్​ ట్రైనర్ అనిల్ (35)..​ ఇటీవల దైవదర్శనం కోసమని మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని ఉజ్జయినికి వెళ్లాడు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో విమానంలో బయలుదేరాడు.

Hyderabad Man Arrested for Trying to open The Doors of a Plane in mid air

అయితే, ఫ్లైట్​ గగనతలంలో ప్రయాణిస్తుండగా, అనిల్​ తన తోటి ప్రయాణికులతో కాస్త అనుచితంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఎయిర్​‌లైన్స్​ సిబ్బంది అతడ్ని అక్కడి నుంచి తీసుకొచ్చి, కాస్త మందలించి క్యాబిన్​ వద్ద ముందు సీట్లో కూర్చోబెట్టారు. అందరూ చూస్తుండగా తన సీట్లోంచి తీసుకొచ్చి, మందలించి ముందు​ సీట్లో కూర్చోబెట్టడాన్ని అవమానంగా భావించిన అనిల్​.. విమానం తలుపులను బలవంతంగా తీయడానికి ప్రయత్నించాడు.

దీంతో ఒక్కసారిగా విమానంలో గందరగోళం నెలకొంది. వెంటనే విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి అతడ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత, శంషాబాద్​‌లో విమానం ల్యాండవగానే.. అనిల్‌ను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు విమాన సిబ్బంది. నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+