హైదరాబాద్ మెట్రో రైల్ కు తుది గడువు.. !!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఫేస్ 2 కోసం 125 కోట్ల రూపాయల పరిపాలన నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు సేవలను అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. జాయింట్ వెంచర్ గా ఇది కార్యరూపం దాల్చబోతోంది.

ఈ పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ మెట్రో రైల్ పై సమీక్ష నిర్వహించారు. కార్యదర్శుల కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు. వచ్చే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, లావాదేవీల సలహాదారు ఐడీబీఐ బ్యాంక్ నివేదికను త్వరగా ఖరారు చేయాలని చెప్పారు.

Hyderabad Metro Rail Takeover to Be Completed by March 2026

ఎల్ అండ్ టీ నుండి స్వాధీనం చేసుకునే ప్రక్రియను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ఈ ప్రక్రియ గడువులోగా పూర్తి కావడానికి ఎల్ అండ్ టీ అధికారులు తమవంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును నడపడం సాధ్యం కాదని ఎల్ అండ్ టీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వమే ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 25వ తేదీన ఎల్ అండ్ టీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మొదటి దశ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 13,000 కోట్ల రుణాన్ని భరిస్తూ ఎల్ అండ్ టీ ఈక్విటీ పెట్టుబడి రూ. 2,000 కోట్లను ఒకేసారి చెల్లించడానికి అంగీకరించింది ప్రభుత్వం. కేంద్రం ఆమోదం కోసం మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

ఫేజ్ 1ను ఫేజ్ 2తో అనుసంధానించడానికి ఎల్ అండ్ టీతో స్పష్టమైన ఒప్పందం ఉండాలని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో ఫేజ్ 2 ప్రాజెక్టులో జాయింట్ వెంచర్‌గా చేరాలని కూడా ఎల్ అండ్ టీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఫేజ్ 2A, 2Bలలో ఈక్విటీ భాగస్వామిగా ఉండలేనని, ఆ ఒప్పందంపై సంతకం చేయలేనని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేకోవర్ చేయడానికి ముందుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+