రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: శీతాకాల విడది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతి పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
కాగా, ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి డిసెంబర్ 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు, బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు.

రాష్ట్రపతి రాక నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌కు సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్ సీపీ ఏకే మహంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు.
#WATCH | President Droupadi Murmu arrives in Hyderabad; received by Telangana Governor Tamilisai Soundararajan and CM Revanth Reddy. pic.twitter.com/rdI0T2K4qj
— ANI (@ANI) December 18, 2023
రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అందుకు వాహనదారులు అందరూ ట్రాఫిక్ వారికి సహకరించాలని కోరారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications