హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో 1 BHK రూ. 25 వేలు, 3 BHK రూ. 50 వేలు.. ఎక్కడో తెలుసా..?
సామాన్య ప్రజలు హైదరాబాద్ లో బతకడం కష్టంగా మారిపోయింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఇంటి అద్దెనా..? లేక నెల జీతమా..? అనే అనుమానం వస్తుంది. హైదరాబాద్ లో బతకడం కష్టమేనా.. అన్న సందేహం వస్తుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఇళ్లు, ఫ్లాట్ల ధరలకే కాదు అద్దె ఇళ్లకు కూడా రెక్కలు వచ్చాయి. అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు సిటీలో ఉండాలంటే సగం జీతం రెంట్లకే పోతుందని వాపోతున్నారు. అటు సొంతిళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేక మరోవైపు అద్దె ఇళ్ల భారం భరించలేక భాగ్యనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లోని ఏ కాలనీకు వెళ్లినా షాకింగ్స్ రెంట్స్ చెప్తున్నారు. సింగిల్ రూమ్ రూ. 10 వేలు పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక సింగిల్ బెడ్ రూమ్ కావాలనుకునేవారు రూ. 12 నుంచి రూ. 15 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ. 30 వేలకు పైగా ఉండటంతో సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు. అద్దెలు కాకుండా మెయింటెనెన్స్ బిల్, వాటర్ బిల్, క్లీనింగ్ బిల్, కరెంట్ బిల్ అని చెప్పి మరో రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు.
అయితే ఈ రెంట్లకే సామాన్య ప్రజలు షాక్ అవుతుంటే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 1BHK రూ.25 వేలు, 3BHK రూ.50 వేలు పలుకుతోందన్న వార్త తెలిస్తే నోరు వెళ్లబెడతారు. అవును ఆ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే అద్దె ధర రూ. 25 వేలు చెల్లించాలి. అదే 3 బెడ్ రూమ్ కావాలంటే రూ. 50 వేలు సమర్పించుకోవాల్సిందే. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు భారీగా వెలిశాయి. దీంతో అక్కడ అపార్ట్ మెంట్స్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది.

కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతాల్లోనే రెంట్ తక్కువగా ఉండేది. కానీ హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ ఏర్పడిన తర్వాత అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు సింగల్ బెడ్ రూమ్ రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.20 వేల నుంచి రు.25 వేల వరకు చెల్లించాలి. ఇక డబుల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.35 వేలు, అలాగే 3 బెడ్ రూమ్ కావాలంటే రూ. 50 వేలు సమర్పించుకోవాల్సిందే. ఖాజాగూడలో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 బెడ్ రూమ్ రెంట్ రూ. 50 వేల పలుతుండటం గమనార్హం. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో హైటెక్ సిటీలో ఇళ్ల అద్దెలు 50 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications