హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు - 17 వరకు ఇలా..!!
గణపతి నవరాత్రులకు హైదరాబాద్ సిద్దమైంది. పలు ప్రాంతాల్లో గణపతి మండపాలు ఏర్పాటు చేసారు. భక్తితో పాటుగా ఉత్సాహంతో గణపతి ఉత్సవాలు నిర్వహణకు నగర వాసులు సిద్దమయ్యారు. ఖైరతాబాద్ లో 70 ఏళ్ల ఉత్సవాల వేళ 70 అడుగులు బడా గణేష్ తొలి పూజలు అందుకుంటున్నారు. ఇదే సమయంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి కొన్ని ఏరియాల్లో మళ్లింపులు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
గణేష్ ఉత్సవాల వేళ
గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు..మళ్లింపులు ప్రకటించారు. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ నిమజ్జనాలు ముగిసే సెప్టెంబర్ 17 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను పూర్తిగా మూసి వేయగా మరికొన్ని మార్గాల్లో సమయాలను కేటాయించారు. బడా గణేష్ సందర్శనకు వచ్చే భక్తులు నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నుంచి రావాలని సూచించారు. భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ఖైరతాబాద్ రైల్వే గేటు నుంచి వచ్చేవారు దర్శనం అనంతరం ఐమాక్స్ థియేటర్ లేదా మిట్ కౌంపౌండ్ వైపు వెళ్లాలి. మింట్ కౌంపౌండ్ నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, వార్డు ఆఫీస్ ముందు నుంచి వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మిట్ కౌంపౌండ్ వైపు వెళ్లాలని సూచించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్ వెళ్లొచ్చు. మిట్ కౌంపౌండ్ వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఖైరతాబాద్ వీవీ విగ్రహం నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) September 6, 2024
Commuters please make a note of the #TrafficAdvisory for Khairatabad #BadaGanesh ji. Devotees who visit Khairatabad #BadaGanesh please make note of Traffic Diversions & Parking places.#TrafficAlert #GaneshFestival@AddlCPTrfHyd pic.twitter.com/9rDn0YScvI
దారి మళ్లింపు
సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ నుంచి రాజ్‌దూత్ లేన్‌లో బడా గణేష్ దగ్గరికి అనుమతి లేదు. ఇక్బాల్ మినార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేయనున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు ఎంట్రీ నిరాకరించారు. మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు.
ఎన్‌టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్స్ నుంచి మింట్ కంపౌండ్ వైపు అనుమతి లేదు. నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు దారి మళ్లించారు. నిరంకారీ ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపుకు వాహనాలను అనుమతించరు. ఇక, ఐమాక్స్ పక్కన అంబేద్కర్ స్క్వేర్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, సరస్వతి విద్యామందిర్, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ఏరియాలు ఖరారు చేసారు.












Click it and Unblock the Notifications