Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో అడుగెట్టిన టెస్లా కారు.. పన్నుల మోతతో షాక్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కొంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు ఈ కారును ముంబైలోని టెస్లా షోరూమ్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి సారి టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా ప్రవీణ్ కోడూరు నిలిచారు. మన దేశంలో ఇప్పటివరకు 5 టెస్లా కార్లు ఉండగా.. ఆరో టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా డాక్టర్ ప్రవీణ్ కోడూరు నిలిచారు. అయితే ఇతర రాష్ట్రంలో కారు కొన్న కారణంగా ఆయనపై 22 శాతం పన్నుల భారం పడింది.

హైదరాబాద్ లో తొలి టెస్లా కారు అడుగుపెట్టింది. కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్‌ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్‌ ల్యాప్రోస్కోపిక్‌, లేజర్‌ సర్జన్‌ గా పనిచేస్తున్న చెందిన వైద్యుడు ప్రవీణ్ కోడూరు ఈ కారును కొనుగోలు చేశారు. ముంబైలోని టెస్లా షోరూమ్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. గత నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కారు డెలివరీ తీసుకున్నానని, అక్కడి నుంచి ఆ కారును నడుపుకొంటూ పుణేలో ఒకసారి, షోలాపూర్ లో మరోసారి ఆగి ఛార్జింగ్ చేసుకున్నామని ప్రవీణ్ కోడూరు తెలిపారు. ఇక భారత్ లో 5 టెస్లా కార్లు ఉండగా.. ఆరో టెస్లా కారును తాము కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు. దాదాపు 770 కి. మీ. ప్రయాణించి హైదరాబాద్ వచ్చామని.. పక్క రాష్ట్రం లో కొనుగోలు చేయడం వల్ల 22 శాతం అధికంగా టాక్స్ పడిందని తెలిపారు.

" నేను ప్రవీణ్ కోడూరు. నేను వైద్యుడిని. హైదరాబాద్ నుంచి తొలి టెస్లా కారును నేను తీసుకున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. బహుశా నా తర్వాత చాలా మంది బుక్ చేసి తీసుకొని ఉంటారు. ఈ కారు షోరూమ్ లు ముంబై, దిల్లీలోనే ఉన్నందువల్ల మేము ముంబైకు వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బై రోడ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే మోస్ట్ అడ్వాన్స్ డ్ వాహనం ఇది. ప్రపంచంలోనే అత్యధికమంది కొనుగోలు చేస్తున్న కారు ఇది. టెస్లా షోరూమ్ ను హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది. దాంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీ కింద రోడ్ టాక్స్ మినహాయింపు ఉంటుంది"

Hyderabad Welcomes First Tesla Dr Praveen Kodur Drives Mumbai-Bought EV to Telangana

అయితే ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేశారన్న కారణంతో భారీగా పన్ను విధించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారు ధర రూ. 63 లక్షలు కావాల్సి ఉండగా, 22 శాతం పన్నుల కారణంగా ఖర్చు అమాంతం పెరిగినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌ కు చెందిన మరో కంపెనీ కూడా టెస్లా కారు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. తానే మొదట డెలివరీ తీసుకున్న వ్యక్తిని అని ఆయన తెలిపారు.

Hyderabad Welcomes First Tesla Dr Praveen Kodur Drives Mumbai-Bought EV to Telangana

టెస్లా అనేది ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సౌరశక్తి ఉత్పత్తులు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలను తయారుచేసే అమెరికన్ కంపెనీ. టెస్లా రోడ్ స్టర్, మోడల్ S, మోడల్ 3, మోడల్ X అలాగే మోడల్ Y వంటి ఎలక్ట్రిక్ కార్లతో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. అత్యాధునిక సాంకేతికత, ఆకట్టుకునే పనితీరు, దీర్ఘ-శ్రేణి సామర్థ్యాలతో కూడిన ఎలక్ట్రిక్ కార్లు దీని సొంతం. 2003లో మార్టిన్ ఎబెర్హార్డ్, మార్క్ టార్పెన్నింగ్ లు ఈ కంపెనీని స్థాపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+