హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైన్ స్నాచర్ అరెస్ట్: పగలు మద్యం మత్తులో, రాత్రయితే హిజ్రాతో సహజీవనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండేళ్లుగా పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

మహబాబ్ నగర్ జిల్లా సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మియనోళ్ల సతీష్ అలియాస్ సత్తి (22) బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నాడు. చిన్నవయసులోనే తండ్రిని పొగొట్టుకున్నాడు. ఎనిమిదో తరగతి వరకు చదివి ఆ తర్వాత చెడు సహవాసాలు చేశాడు.

మద్యానికి బానిస అయ్యాడు. చిన్న చిన్న పనులు చేసినా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో 18వ యేట చైన్ స్నాచర్‌గా
మారాడు. ధనవంతులు నివసించే కాలనీలను ఎంచుకొని స్నాచింగ్‌లు చేయడం మొదలు పెట్టాడు.

శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమం ప్రాంతంలో మూడు, బంజారిహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఓ స్నాచింగ్ సంఘటనలో ప్రధాన నిందితుడు. రెండు రోజుల క్రితం పోలీసులు ఎల్లారెడ్డిగూడ ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ వాహనంపై తిరుగుతున్న సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

hyderabad youth staying with hijra

జంట కమిషనరేట్ల పరిధిలో సతీష్‌పై ఇప్పటికే 17 కేసులున్నాయి. సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా పడింది. సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బంగారు ఆభరణాలు, బజాజ్ పల్సర్, హోండా యూనికాన్ వాహనాలను, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఇందిరానగర్‌లో నివసించే సతీష్‌కు ఏడాది క్రితం హిజ్రాతో పరిచయమైంది. దీంతో హిజ్రాతో కలిసి సూరారం ప్రాంతంలో నివసిస్తున్నాడు. సతీష్ అంటే ఇష్టపడే హిజ్రా తాను వసూలు చేసే డబ్బు కూడా అతని ఖర్చులకే ఉపయోగించేది.

సతీష్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలియగానే హిజ్రా పరారీలో ఉన్నాడు. స్నాచింగ్‌లలో హిజ్రాకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొంతమంది హిజ్రాలతో సైతం సతీష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

English summary
hyderabad youth staying with hijra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X