బెస్ట్ సన్ రైజ్.. సన్ సెట్ ప్రాంతాలు.. హైదరాబాద్లో ఎక్కడంటే..?
హైదరాబాద్ కు దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. హైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చార్మినార్ , గోల్కొండ, కుతుబ్ షాహీ టోంబ్స్, ఫలక్ నుమా ప్యాలెస్, దారుల్ షిఫా లాంటి పురాతన కట్టడాలు పర్యటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయం రెండింటినీ ఆస్వాదించేందుకు చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ లోనూ సన్ రైజ్, సన్ సెట్ రెండూ అందంగా కనిపించే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల నుంచి వీటిని వీక్షిస్తే కన్నుల విందుగా ఉంటుంది. మరి ఆ ప్రాంతాలు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి.
వీటిల్లో ఉస్మాన్ సాగర్ సరస్సు ఒకటి. దీన్ని స్థానికులు గండిపేట అని కూడా పిలుస్తారు. ఈ డ్యామ్ ను మూసీ నదిపై నిర్మించారు. చుట్టూ అందమైన పిక్నిక్ ప్రదేశాలు, పార్కులతో ఉస్మాన్ సాగర్.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. ఉస్మాన్ సాగర్ వద్ద సూర్యాస్తమయాన్ని సందర్శకులు వీక్షించవచ్చు. దట్టమైన కొండల మధ్య సూర్యాస్తమయాన్ని చూడటానికి అనువైన ప్రదేశంగా చెబుతారు.
బిర్లా ప్లానిటోరియం.. హుస్సేన్ సాగర్ సమీపంలోని నౌబత్ పహాడ్ అనే ఎత్తయిన కొండపైన నిర్మించారు. 1985 లో దీన్ని నిర్మించారు. ఈ కొండ పైనుంచి హైదరాబాద్ సిటీ వ్యూ అద్భుతంగా ఉంటుంది. నగరంలోనే సూర్యోదయాన్ని చూసేందుకు ఇష్టపడేవాళ్లు బిర్లా ప్లానిటోరియంకు తప్పక వెళ్లాల్సిందే. అలాగే గోల్కొండ కోట వద్ద కూడా సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కొండపైనుంచి నగరం మొత్తం వీక్షించవచ్చు. సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ కోట ఎక్కడం మంచి అనుభూతిని కలిగిస్తుంది.
దుర్గం చెరువు.. హైదరాబాద్ లోని మాదాపూర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం ప్రాంతాల మధ్య ఉంటుంది. దీన్ని సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తారు. దీనిపై నిర్మించిన అత్యాధునిక కేబుల్ బ్రిడ్జి (తీగల వంతెన) నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇది పర్యాటకులకు, స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్, బూటింగ్.. తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక చివరగా హుస్సేన్ సాగర్ సరస్సు.. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద సందర్శకులు సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. సన్ రైజ్, సన్ సెట్ సమయాల్లో ఇక్కడ వాకింగ్, రన్నింగ్ తో పాటు రిలాక్స్ అవ్వొచ్చు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
'తెలంగాణ అమర్నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications