ఐ బొమ్మ రవి ఏంట్రా ఇంత పని చేశాడు, పోలీస్ కస్టడీలో అలా చెప్పాడేంటి!

పైరసీ సామ్రాజ్యాన్ని ఏలిన, సైబర్ క్రైమ్ నేరాలకు, బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లకు పాల్పడిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . ఇమ్మడి రవి పైరసీ సినిమాల కేసులో పోలీసులు అతనిని విచారిస్తున్నారు. రవిని అరెస్ట్ చేసిన తర్వాత మొదట కేసు విచారణలో ఐదు రోజులు, మళ్లీ తాజాగా మరో మూడు రోజులు పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

రవిని విచారిస్తున్న పోలీసులు
ఐ బొమ్మ రవికి సహకరించిన వారిని, అతడు ఏ విధంగా ఈ దందాకు పాల్పడ్డాడు అనే దానిని సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ పోలీసులు పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఐ బొమ్మ రవి కేసును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని సంకేతం ఇస్తున్నారు.

I Bomma Ravi case Ravi shocked fans what he said in police custody

ఆ వివరాలను సేకరిస్తున్న పోలీసులు
అయితే మరోవైపు ఐ బొమ్మ రవికి మద్దతుగా సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సజ్జనార్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా గొంతును మాత్రం ఆపలేకపోతున్నారు. మరోవైపు రవి విచారణలో దేశ విదేశాలలో ఉన్న రవి ఏజెంట్లను, ఉద్యోగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పెదవి విప్పిన ఐ బొమ్మ రవి
విచారణ మొదట్లో తెలియదు, గుర్తులేదు అంటూ ఏ విషయాన్ని బయటకు చెప్పని, పోలీసుల ప్రతి ప్రశ్నకు మౌనాన్ని సమాధానంగా చెప్పిన రవి, తాజాగా పెదవి విప్పినట్టు సమాచారం. పైరసీ గుట్టు బయట పడితే విదేశీ పౌరసత్వం కారణంగా తప్పించుకోవచ్చని తను భావించినట్టు రవి అంగీకరించినట్టు సమాచారం.

పశ్చాత్తాపంలో ఐ బొమ్మ రవి
గత ఆరేళ్ల నుండి తనను ఎవరు గుర్తించలేకపోయారు అని భావించి, తన నెట్వర్క్ ను మరింత బలోపేతం చేశానని రవి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొదట్లో కాస్త డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ పనులు చేశానని, అది తప్పు అని గుర్తించలేక పోయానని రవి పశ్చాతాపం వ్యక్తం చేసినట్టు సమాచారం.

మళ్ళీ పైరసీ జోలికి వెళ్ళను: ఐ బొమ్మ రవి
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తను పూర్తిగా మారిపోతానని, మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులను ప్రాధేయపడినట్లు ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతుంది. ఇది నిజమైతే రవి తన ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్టే. ఒకవేళ అదే గనుక జరిగితే ఇమ్మడి రవి తన అభిమానులందరి ఆశల పైన నీళ్ళు పోసినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+