వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా'

తప్పు చేస్తే రాజకీయాల నుండి తప్పుకొనేందుకు సిద్దమని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ఎల్. రమణపై గురువారం నాడు చేసిన విమర్శలపై రమణ శుక్రవారం నాడు స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తప్పు చేస్తే రాజకీయాల నుండి తప్పుకొనేందుకు సిద్దమని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ఎల్. రమణపై గురువారం నాడు చేసిన విమర్శలపై రమణ శుక్రవారం నాడు స్పందించారు.

వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనంవాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

టిడిపిలో గందరగోళం చోటుచేసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి తన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది.

ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి వెళ్ళనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రేవంత్‌రెడ్డి పదవుల నుండి తప్పిస్తూ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై రేవంత్‌రెడ్డి పార్టీ నేతల వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాదు కొందరు నేతలపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద టిటిడిపి నేతలు శుక్రవారం ఉదయం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడారు.

చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

రాజకీయాల నుండి తప్పుకొంటా

రాజకీయాల నుండి తప్పుకొంటా

తాను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఏనాడూ కూడ తప్పు చేయలేదని రమణ ప్రకటించారు.

వివరణ తీసుకొనే అధికారం ఉంది

వివరణ తీసుకొనే అధికారం ఉంది

పార్టీ నాయకులు తప్పు చేశారని సమాచారం ఉంటే వారి నుండి వివరణ తీసుకొనే అధికారం తనకు ఉందని ఎల్. రమణ అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలపై వివరణ తీసుకోనే అధికారం ఉందన్నారు. నేతలు ఎవరైనా సరే వివరణ తీసుకొంటే తప్పుబడతారా అని రమణ ప్రశ్నించారు.

 నా ఆస్తులపై చర్చించేందుకు రెఢీ

నా ఆస్తులపై చర్చించేందుకు రెఢీ

రాజకీయాలనుండి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు తన ఆస్తులపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డుపెట్టుకొని తాను సంపాదించలేదని రమణ చెప్పారు.

 రేవంత్‌పై చర్యలపై బాబుదే నిర్ణయం

రేవంత్‌పై చర్యలపై బాబుదే నిర్ణయం

రేవంత్‌రెడ్డిపై చర్యల విషయంలో చంద్రబాబునాయుదే తుది నిర్ణయమని ఎల్. రమణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు రేవంత్‌పై ఎలాంటి చర్యలు తీసుకొన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే అదే సమయంలో చర్యల విషయంలో చంద్రబాబునాయుడుదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.

English summary
I have right to take necessary action against any party leader said TTDP President L. Ramana. He spoke to media on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X