ఆ పార్లమెంట్ స్థానంపై గురిపెట్టిన ఈటల రాజేందర్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలతోపాటు స్థానిక నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన మనసులోని మాటను వెల్లడించారు.
కరీంనగర్‌లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి.. తాను అక్కడ టికెట్ ఆశించడం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్లు ఈటల తెలిపారు. అధిష్టానం ఎలా చెబితే అలా వింటానని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లరమల్లరగా రాస్తున్నాయని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దన్నారు. రెండవ విడత దళితబంధు వెంటనే ఇవ్వాలని ఈటల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమెరికా లాంటి అగ్రరాజ్యం భారతదేశానికి రెడ్ కార్పెట్ వేస్తోందని.. నరేంద్ర మోడీ వల్లే మనదేశం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పారు. బీజేపీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని అంటున్నారని.. ప్రజలు అధికారం కట్టబెట్టారని, మళ్లీ కూల్చే అధికారం వల్లకే ఉంటుందని ఈటల వ్యాఖ్యానించారు. 2018లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారని.. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈటల చెప్పుకొచ్చారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications