IBOMMA నిర్వాహకుడు రవి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEO అని తెలుసా..!
'ఐబొమ్మ' వెబ్‌సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2019 నుంచి భారీ నెట్‌వర్క్‌ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి.. ఇండస్ట్రీకి సుమారు రూ.3,000 కోట్ల నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిగా రవిని గుర్తించారు. కాగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారించిన జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవిని చంచల్ గూడ జైలు కు తరలించారు.
ఎలా అరెస్ట్ అయ్యారంటే..
కాగా ఐ బొమ్మ రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందవేసినట్టు తెలుస్తుంది. దీంతో సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది.

సాఫ్ట్‌వేర్ కంపెనీ CEO..
మరోవైపు రవి ముంబై యూనివర్సిటీలో రవి ఎంబీఏ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే అతను నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ అందించే సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్‌కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.
ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. పోలీసులు విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు చెబుతున్నారు.
ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు#IBomma #BappamTV #ImmadiRavi #ImmadiRaviArrest #Piracy #ReelTalk #Oneindia #OITelugu pic.twitter.com/Yxbo5TQkJl
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2025
iBomma సైట్ తరచూ డొమైన్ మార్చడం, కొత్త లింకులు విడుదల చేయడం వల్ల పోలీసులు పలుమార్లు ట్రేస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు సీసీఎస్ టీమ్ వెబ్‌సైట్ సర్వర్ల లొకేషన్లు, గత డొమైన్ హిస్టరీ, విదేశీ సర్వర్ లాగ్స్ అన్ని సేకరించి పరిశీలిస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications