Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో మిచౌంగ్ తుఫాను ప్రభావం: వర్షాలతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్ లు!!

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలలో అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుండి వర్షాలు కురుస్తున్నాయి.

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Impact of Cyclone Michaung in Telangana: Red and Orange Alerts for many districts due to rain!!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో నేడు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఎర్రుపాలెం, మధిర, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో 200 మి.మీ.కు పైగా, మిగతా మండలాల్లో 100 మి.మీ.కు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జెవిఆర్ ఓపెన్ కాస్ట్ మరియు కిష్టారం ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు ఆటంకం ఏర్పడింది.

ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరుకోవడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. సింగరేణి లోతట్టు ప్రాంతాల్లో అధికారులు లైఫ్ బోట్లను సిద్ధంగా ఉంచారు.మరోవైపు రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులకు, రిజర్వాయర్లకు వరద నీరు చేరుకుంటుంది.

వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖాధికారులు వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు . తుఫాను ప్రభావంతో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది . మిచౌంగ్ తుఫాను ప్రభావం మరో రెండు రోజులు వరంగల్ జిల్లాపై ఉంటుందని ఆయన తెలిపారు . ఇక అనేక చోట్ల చెదురు మదురు వర్షాలు కురుస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+