తాకొద్దన్నా.. భారతీయ మహిళ మీదమీదకు ఆఫ్రికన్ అమెరికన్ (వీడియో)
న్యూయార్క్ మెట్రో రైల్లో వెళ్తున్న ఓ భారతీయ మహిళను కొందరు వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. బాధితురాలి పేరు ఏక్తా దేశాయ్.
న్యూయార్క్: న్యూయార్క్ మెట్రో రైల్లో వెళ్తున్న ఓ భారతీయ మహిళను కొందరు వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. బాధితురాలి పేరు ఏక్తా దేశాయ్.
ఏక్తా దేశాయ్ న్యూయార్క్ మెట్రో రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో తన సీటు పక్కలోనే కూర్చొన్న ఆఫ్రో అమెరికన్ జాతి వివక్ష ప్రదర్శించాడు. హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్న ఆమె తన మొహం మీదకు అమెరికన్ వచ్చి అరుస్తున్నా తొలుత పట్టించుకోలేదు.
ప్రవర్తన తీవ్రంగా ఉండటంతో హెడ్‌ఫోన్లు తీసేసింది. అప్పుడు అతను.. మీ దేశానికి వెళ్లిపో అని హెచ్చరించాడు. ఏక్తా తన ఫోన్‌తో రికార్డ్ చేస్తుండగా.. నేను తిడతానని, నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పాడు.
తనను తాకవద్దు అని ఆమె హెచ్చరించినా వినకుండా బెదిరిస్తూ భయపెడుతూ మీదమీదకు వచ్చాడు. ఆమెను నోటికి వచ్చినట్లుగా తిట్టాడు.
ఆ తర్వాత ఎక్తా దేశాయ్ పక్కనున్న ఆసియన్ మహిళ మీద తన తిట్ల ప్రతాపం చూపించాడు. అతడి విద్వేషాన్నంతటినీ కెమెరాలో చిత్రీకరించిన ఎక్తా దేశాయ్ మొదట దాన్ని బయట పెట్టలేదు.
కాన్సస్‌లో జాతి విద్వేష దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అతను అసభ్యంగా ప్రవర్తించిన పావు గంట తర్వాత పోలీసులు వచ్చారని, వారేమీ అతనిపై చర్య తీసుకోలేదని పేర్కొన్నారు.
అంతకుముందే ఈ సంఘటన జరిగింది. కానీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి అనంతరం ఆమె వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఆరు రోజుల్లో 33 వేల వ్యూస్ వచ్చాయి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications