ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత మంత్రాన్ని పఠిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కోసం ప్రజల కోసం ఆయా పార్టీలు ఉచితంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టడం మనం చూశాం.

అయితే ఈ 'ఉచితం'పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు.

వివరాల్లోకి వెళితే... సోమవారం హైదరాబాదులో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎఫ్‌టాప్సీ వంద సంవత్సరాల లోగో, మార్పులు చేసిన వెబ్‌సైటును, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.

 ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌టాప్సీ శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించడం తనకెంతో గర్వకారణంగా ఉందని, ఎఫ్‌టాప్సీ ప్రయాణంలో పాలుపంచుకున్న వారందరికీ ఇది మరిచిపోలేని రోజని గవర్నర్‌ పేర్కొన్నారు. పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ను ప్రధానంగా ప్రస్తావించారు.

 ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలని ఆయన సూచించారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. వీటిలో సామర్థ్యాలు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ కోరారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

‘‘సామాజికంగా వివిధ వర్గాలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలుంటాయి. వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. సంపాదించే శక్తినీ ఇవ్వాలి. దాంతో వారు ఆత్మ గౌరవంతో జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఉచిత పథకాలను తప్పనిసరిగా రద్దు చేయాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్

ఈ కార్యక్రమంలో ఎఫ్‌టాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌర శ్రీనివాస్‌, శతాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ అనిల్‌ రెడ్డి వెన్నం తదితరులు మాట్లాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The industry should bridge the urban-rural divide by promoting innovation and skill development in rural areas, according to ESL Narasimhan, Governor of Telangana and Andhra Pradesh. He was speaking after flagging off the centenary celebrations of the Federation of Telangana and Andhra Pradesh Chambers of Commerce and Industry (FTAPCCI) here on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి