హైదరాబాద్‌లో సాఫ్టువేర్ ఉద్యోగి ఆత్మహత్య: ప్రేమించిన యువతికి ఐలవ్యూ అని పంపి..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 34 ఏళ్ల వయస్సున్న కిరణ్ కుమార్ మాదాపూర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. తాను ఉంటున్న హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ విఫలమైనందునే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగా అతను కుంగుబాటుకు గురై ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కిరణ్ కుమార్ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందినవాడు. నాలుగు నెలల క్రితం ఇన్ఫోసిస్‌లో చేరాడు. మాదాపూర్‌లోని మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు. వారం రోజులుగా విధులకు వెళ్లడం లేదు. శనివారం ఉదయం స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
అనుమానం వచ్చిన స్నేహితులు మధ్యాహ్నం హాస్టల్ గది తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. కిరణ్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దూరం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి యువతికి ఐ లవ్‌యూ అని వాట్సాప్ మెసేజ్ పంపించి, ఆ తర్వాత చనిపోయాడు.
-
తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications