Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉరేసుకున్న భవాని.. కళాశాలలో విధ్వంసం!!

హనుమకొండ లోని నక్కల గుట్టలోని వైబ్రాంట్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. నక్కలగుట్టలో గల వైబ్రాంట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న ఏనుగుల భవాని అనే విద్యార్థి నిన్న అర్ధరాత్రి కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
గదిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనను చూసిన విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించగా హుటాహుటిన విద్యార్థినిని రోహిణి ఆసుపత్రికి తరలించారు. రోహిణి ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి వచ్చే వరకే విద్యార్థిని మరణించిందని వెల్లడించారు.ములుగు జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన భవాని ఆత్మహత్య పైన ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

inter student suicide in a hanamkonda private college relatives destruction in college

కళాశాలలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన విద్యార్ధి బంధువులు
ప్రస్తుతం విద్యార్థిని మృతదేహం ఎంజిఎం మార్చరీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులు కళాశాల ముందు బైఠాయించి తమ కుమార్తె మరణం పైన తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు విద్యార్థిని తరపు బంధువులు కళాశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసుల బందోబస్తులో కళాశాల
విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైబ్రాంట్ జూనియర్ కళాశాల చుట్టూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని బంధువులు, కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రి వద్ద శోకసంద్రంలో మునిగిపోయారు. కళాశాలలో విద్యార్థినుల ఆత్మహత్యలు పరిపాటిగా మారాయి. చిన్న చిన్న కారణాలకే విద్యార్థినులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడడం వారి మానసిక స్థితికి అడ్డం పడుతుంది.

భవాని ఆత్మహత్య కారణాలపై పోలీసుల దర్యాప్తు
నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు తీరని కడుపు శోకాన్ని మిగులుస్తూ విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళనకరంగా మారుతుంది. ప్రస్తుతం భవాని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. భవాని అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా ఇతర ఒత్తిడి భవాని పైన ఉందా అన్నది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+