Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవిత కొత్త పార్టీ జెండా, సింబల్ ఇదే..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయంతో కవితపై వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తనతో పార్టీకి నష్టం కలుగుతుందని.. అందుకే ఈ విధంగా డిసిషన్ తీసుకున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలోనే తండ్రి కేసీఆర్ కు రివర్స్ షాక్ ఇవ్వాలని కవిత డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం పైన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవితో పాటుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అంతే కాకుండా కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

interesting-details-about-kavitha-new-party-flag-and-symbol

అసలు అక్కడి నుంచే..

ముందుగా లేఖల లీక్ తో స్టార్ట్ అయిన ఈ వ్యవహారం.. కేసీఆర్ దేవుడని.. ఆయన వద్ద దయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివేట్ చేయడం.. వరుసగా నిరసన కార్యక్రమాలతో ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. కానీ బీఆర్‌ఎస్‌ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను అనూహ్యంగా పక్కకు తప్పించారు. కవిత స్థానంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే సింగరేణిలో స్వతంత్ర సంఘంగా ఉన్న హెచ్‌ఎంఎస్‌తో జత కట్టి సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే ఇన్నాళ్లు చాప కింద నీరు లాగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది అనిపిస్తుంది. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ తరువాత సీబీఐకి కేసు అప్పగించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ విషయంపై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ పైన కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ యాక్షన్ తీసుకుంది.

కొత్త పార్టీ..

కాగా కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తెలుస్తుండగా.. అందుకోసం ఇప్పటికే పేర్ల పైన చర్చించినట్లు కూడా టాక్ నడుస్తోంది. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలానే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్‌ఎస్‌) పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరు కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే "తెలంగాణ జన జాగృతి", "జన జాగృతిపార్టీ" పేరున రెండు రిజిస్ట్రేషన్లు అయ్యాయని కవిత సన్నిహితులు చెబుతున్నారు.

జెండా & సింబల్..

మరోవైపు కవిత కొత్తపార్టీ జెండా రంగులు & పార్టీ సింబల్ కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ నినాదాలతోనే ముందుకు పోతే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో కవిత అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు. ఎలాగైతే టిఆర్ఎస్ పార్టీ జనాలకు సులువుగా గుర్తుండేలా.. గులాబీ రంగు జెండా, అంబాసిడర్ కారును గుర్తుగా ఉంచారో అదే విధంగా తన కొత్త పార్టీ సింబల్ కూడా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

బతుకమ్మతో ఫేమస్ అయిన కవిత.. జాగృతి ఆర్గనైజేషన్ తో తెలంగాణ వ్యాప్తంగా గుర్తిమపు తెచ్చుకుంది. అందుకే బతుకమ్మ సింబల్ తోనే రాజకీయంగా సైతం ముందుకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ జెండాలో ఇరువైపులా ఆకుపచ్చ మధ్యలో తెలుగు రంగు ఉండేలా చూస్తున్నారట. అలానే తెలంగాణ మ్యాప్.. ఓరుగల్లు కోట.. బతుకమ్మ ఇలా మూడింటిని కలిపి పార్టీ జెండాలో కనిపించేలా డిజైన్ చేయిస్తున్నారని నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం చాలా రోజులుగా ప్లాన్ నడుస్తున్నా.. ఇప్పుడు బయటపడనుందని నేతలు అంటున్నారు.

interesting-details-about-kavitha-new-party-flag-and-symbol

ఇక మరోవైపు కవిత పార్టీ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంత ఫ్యామిలీ డ్రామా అని ఆరోపణలు చేస్తున్నారు. మరి కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎంతమేర మార్పు తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+